– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
గుంటూరు: అమరావతి రైతులు బాధలు వర్ణనాతీతం…. గతంలోనే నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 100కోట్ల యూ జీ డి నిధులు సంక్షన్ చేసాం… అమరావతి అభివృద్ధి విషయంలో మేం ఎప్పుడూ కట్టిబడి ఉంటామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ మేరకు ఆయన సారథ్యంలో భాగంగా గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడారు.
గత వైసీపీ ప్రభుత్వ దగాతో అమరావతి రైతులు నిర్వీర్యం అయిపోయారు. కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తుంది… అమరావతి ఆయువు పట్టు ఓ ఆర్ ఆర్ నిర్మాణం పై ప్రత్యేక దృష్టి పెట్టి10వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేశాం. కోట్లాది రూపాయల నిధులతో అమరావతి పనులు ప్రారంభం అయ్యింది.. గుంటూరు మిర్చి యార్డ్ పై ప్రత్యేక దృష్టి సారించింది మిర్చి రైతులను ఆదుకోవడాని బీజేపీ ముందుంటుందని భరోసా ఇచ్చారు.