– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ: మతతత్వ బీజేపీ పాలనలో మైనారిటీలకు రక్షణ లేదు. మైనారిటీ హక్కుల పట్ల విలువ లేదు. హిందూ – ముస్లిం భాయి భాయి అనేది కాంగ్రెస్ సిద్ధాంతమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. హిందూ – ముస్లిం, క్రిస్టియన్ మధ్య చిచ్చు పెట్టడం బీజేపీ సిద్ధాంతం… చిచ్చు పెట్టీ ఆ మంటల్లో చలి కాచుకోవడం బీజేపీ సిద్ధాంతం.. మతం పేరుతో, విభజన పేరుతో బీజేపీ మంటలు పెడుతోందని ఆమె విమర్శించారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే… మతాలుగా ఈ దేశాన్ని బీజేపీ విభజిస్తుంది. ముస్లిం చట్టాల్లో బీజేపీ వేలు పెడుతుంది. సీఏఏ, వక్ఫ్ బోర్డు సవరణ, ఆర్టికల్ 370, అయోధ్య రామమందిరం లాంటి వివాదాలతో ముస్లిం మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీశారు. మోడీ మరో బ్రిటిషర్.. విభజించు పాలించు లాంటి బ్రిటీష్ సిద్ధాంతాలను అమలు చేస్తున్నారు.
మణిపూర్, గోద్రా అల్లర్లు ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీలు పూర్తిగా బీజేపీ పార్టీలే.
టీడీపీ, జనసేన బహిరంగ పొత్తు.. వైసీపీ అధ్యక్షుడు జగన్ ది అక్రమ పొత్తు. జగన్ బీజేపీ కి దత్తపుత్రుడు. సెక్యులర్ పార్టీ ముసుగులో మైనారిటీలను టీడీపీ, వైసీపీ లు మోసం చేస్తున్నాయి. మైనారిటీల ప్రయోజనాలు దెబ్బతీసే అన్ని బిల్లులకు మద్దతు ఇస్తున్నారు. వైఎస్ కొడుకు అయ్యి ఉండి ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లులకు మద్దతు ఇవ్వడం దారుణం. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలు మైనారిటీలను ఉద్ధరించింది శూన్యం.
పదేళ్ళుగా ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు, జగన్ ఇద్దరు మైనారిటీల పట్ల ద్రోహులే…- 45, 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని మోసం చేశారు. ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్ అని మోసం చేశారు. మైనారిటీ సబ్ ప్లాన్ అని మోసమే… ముస్లిం నిరుద్యోగులకు 5 లక్షల సహాయం అని మోసమే.. వడ్డీ లేని రుణాలు అని మోసమే.
రాష్ట్రంలో, దేశంలో మైనారిటీల హక్కులు కాపాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే… ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్ ను పార్టీని విశ్వస్తున్నారు.. వారి నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి.. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ వద్దకు వచ్చేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలి.