Suryaa.co.in

Telangana

మీ సర్కారును కూలదోస్తామన్న కుట్రదారు బీఎల్‌ సంతోష్‌ హైదరాబాద్ వచ్చిండటగా!

మరి ఇప్పుడైనా ఆయన్ని అరెస్టు చేసే దమ్ముందా?
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్వీట్

కేసీఆర్! మీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా? అదే తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా?

ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ సందర్భంలో..మీ సర్కారును కూలదోస్తామన్న కుట్రదారు బీఎల్‌ సంతోష్‌ హైదరాబాద్ వచ్చిండటగా.. ఇన్నాళ్లు అడ్రస్ దొరకలేదని తప్పించుకుంటిరి.. మరి ఇప్పుడైనా ఆయన్ని అరెస్టు చేసే దమ్ముందా?

ఆ కట్టుకథను ప్రజలు మర్చిపోతారులే అని అతిథ్యమిస్తారా? లేక సిట్ ను నిద్రలేపి అరెస్టేమైనా చేస్తారా? తెలంగాణ చూస్తోంది.. మీ సమాధానం కోసం..!!

LEAVE A RESPONSE