Suryaa.co.in

Andhra Pradesh

ఎన్‌ఐఏ-పోలీసుల దాడులపై ఏపీ హైకోర్టు న్యాయవాదుల నిరసన

హైకోర్టు న్యాయవాదులు ఈ రోజు మధ్యాహ్నం న్యాయవాదుల పైన ఎన్‌ఐఏ / పోలీసుల దాడిని ఖండిస్తూ అమరావతి హైకోర్టు దగ్గర నిరశన తెలియచేశారు.
గత వారం తెలుగు రాష్ట్రాలల్లో వివిధ చోట్ల ముఖ్యమైన కేసులలో వాదిస్తున్న న్యాయవాదుల ఇళ్ళ పై, కార్యాలయాల పైన దాడులు చేసి కొందరిని నిర్భందించటం జరిగింది.ఈ నిర్భంద చర్యలను న్యాయవాద హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని దర్నాలో పాల్గొన్న వ్యక్తులు నిరసన తెలియచేశారు. న్యాయ వాదుల హక్కుల మాత్రమే కాక కక్షి దారుల హక్కుల ను కూడా దెబ్బ తీసే విధంగా ఉన్నాయని అక్కడ పాల్గొన్న న్యాయవాదులు పేర్కొన్నారు.

ఎన్‌ఐఏ దాడుల బాధిత న్యాయవాదులు పౌర హక్కుల నాయకులు పిచ్చుక శ్రీనివాస్, సురేష్ కుమార్ లు తమ పైన దాడిని వివరించారు.
ఈ కార్యక్రమం లో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్, తెలుగు దేశం లీగల్ సెల్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అడ్వకేట అస్సోషియేషన్, వై ఎస్ ఆర్ కాంగ్రెసు లీగల్ సెల్, బార్ కౌన్సిల్ కి సంభందించిన ప్రతినిధులు పాల్గొన్నారు.

బార్ కౌన్సిల్ సభ్యులు, కె చిదంబరం సుంకర రాజేంద్ర ప్రసాద్, తెలుగు దేశం లీగల్ సెల్ అధ్యక్షులు పోసాని వెంకటేశ్వర్లు, నాయకులు సోమ రాజు, వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ నాయకులు న్యాయవాది ఎన్ రాజ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ కార్యదర్శి వి వి సాయి కుమార్, సంయుక్త కార్యదర్శి సోలమన్ రాజు, సీనియర్ ఎక్జిక్యూటివ్ మెంబర్ శ్రీధర్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మాధవ రావు, నాయకులు నర్రా శ్రీనివాస రావు, వై రమేష్, న్యాయవాదులు – సైకం రాజ శేఖర్, బషీర్, పిళ్లా యస్విని, పి దివ్య, పెమ్మసాని వినోద్, షేక్ ఇస్మాయిల్, చావా నాగేశ్వర రావు, జి రాజు, సంపర శ్రీనివాస్, చుక్కపల్లి భాను, రామ్ బాబు, పాటిబండ్ల ప్రభాకర రావు, అశ్విన్ నర్శిపురం, రవితేజ పదిరి తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE