రాష్ట్రం అంత అవినీతి మయం

1

– ఏప్రిల్ 16 నుంచి బిజెపీ ఆధ్వర్యం లో పార్టీ కార్యక్రమాలు
– సత్తెనపల్లి బిజెపి పార్టీ పట్టణ మండల అద్యక్షుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

ఆకాల వర్షాలకు దెబ్బతిన్న పంటకు నష్ట పరిహారం చెల్లించాలి. ప్రధాని మోడీ పై రాహుల్ చేసిన వాఖ్యలకు కోర్టు శిక్ష విధించింది.గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం పెరిగింది.రాష్ట్ర ప్రభుత్వం వైపల్యాలపై చార్జిషీట్ వేస్తాం.రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సంక్షోభంలో వుంది.రాష్ట్రంలో వనరులు దోపిడీకి గురైయ్యాయి. అక్రమ దందాలపై బీజేపీ ఉద్యమిస్తుంది.అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను నష్టపరిహారం ప్రభుత్వం తక్షణమే అందించాలి.రాష్ట్రంలో రైతు సమస్యల మీద కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ల వద్ద ధర్న కార్యక్రమాలు నిర్వహిస్తాం.

రాష్ట్ర ప్రభుత్వం సహజవనరుల నూ దోపిడీ చేసి 2 కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేస్తుంది. రాష్ట్రం అంత అవినీతి మయంగా మారింది. ఇసుక రేషన్ ను విచ్చలవిడిగా బహిరంగంగా అమ్ముకుంటున్నారు.రాష్ట్రం లో బిజెపి బలంగా వుందని చెప్పడానికి బధ్వేల్ తిరుపతి ఎన్నికలే సాక్ష్యం. ఏప్రిల్ 16 నుంచి బీజేపీ ఆధ్వర్యం లో పార్టీ బలోపేతం కార్యక్రమాలు చేపడతాం.