-అంబటి అబద్దాలతో అసెంబ్లీ
-శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు
పోలవరం ప్రాజెక్టులో 15 నెలల పనుల జాప్యం వల్ల, 2020 ఆగస్టు – అక్టోబర్ మద్య వచ్చిన వరదల వలన డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని నీతి ఆయోగ్ నియమించిన హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ నియమించిన ఐఐటీ హైదరాబాద్ నవంబర్ 05, 2021న Final Evaluation Report నివేదికలో పేజీ-38, Chapter – 04, ANALYSIS OF TIME DELAYS ప్రకారం, అసమర్ధ ప్రణాళిక, ఖాళీలను పూరించడంలో జాప్యం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతింది. (The reasons for this destruction can be attributed to “inefficient planning due to untimely closure of gaps on the coffer dam”). పోలవరానికి జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ నిర్మాణ జాప్యానికి దారి తీసింది. గత కాంట్రాక్టర్ నే కొనసాగించి ఉంటే 2020 లోపే పోలవరం పూర్తి అయి ఉండేది. పనులు ముమ్మరంగా సాగిస్తున్న గుత్తుదారుని మార్చవద్దని ఆనాడే చెప్పినా మీరు వినకపోవడం వలనే అనర్ధం జరిగిందని జులై 22, 2022న పీపీఏ సీఎస్ కు లేఖ రాశారు.
అసెంబ్లీలో అంబటి రాంబాబు అబద్దాలతోనే సరిపుచ్చారు. తన తప్పును గత ప్రభుత్వంపై నెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నంలో ఉన్నారు. 5 ఏళ్లల్లో టీడీపీ 71 శాతం పూర్తి చేస్తే 4 ఏళ్లల్లో జగన్ 7 శాతమే పనులు పూర్తి చేశారు. జగన్ రెడ్డి అసమర్ధతతోనే నేడు డయాఫ్రం వాల్ మరమ్మత్తులకు రూ.2,000 కోట్ల వరకు ప్రజాధనం ఖర్చు అవుతుంది. సమయం ఉన్నా ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టులో ఇంత తీవ్ర సమస్య ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాం నిర్మాణాలు సమాంతరంగా చేయాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకొని పనులు ముమ్మరం చేసింది. ఏ ప్రభుత్వమైనా పోలవరంలో పనులు చేయాలన్నా అందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, డ్యాం డిజైన్ రివ్యూ కమిటీలు ఆమోదం తప్పని సరి. 2020 వరదల్లో పోలవరంలో విధ్వంసం జరిగిందని జగన్ 2022 మార్చి 22న అసెంబ్లీలో చెప్పారు. అప్పటి వరకు నిర్వహించిన సమావేశంలో ఎందుకు దాచిపెట్టారు?
పోలవరం పూర్తి అయ్యి ఉత్తరాంధ్ర, రాయలసీమలు సస్యశ్యామలం అవ్వటం జగన్ కు ఇష్టం లేదు. అన్ని ప్రాంతాల్లో నీరు సమృద్ధిగా పారితే ప్రజల దగ్గర నిధులు ఉంటాయి, అప్పుడు జగన్ రెడ్డి ఆడే బూటకపు సంక్షేమ నాటకం, ప్రాంతాల మధ్య చిచ్చు వంటివి భయటపడతాయన్న భయంతోనే పోలవరాన్ని కావాలని అటకెక్కించారు. అందుకే పోలవరం పూర్తికి జగన్ అడుగు ముందుకు వేయడంలేదు. నిధులు ఇవ్వమని, టీడీపీ ఆమోదింపజేసుకున్న డీపీఆర్ -2 ఆమోదించమని కేంద్రంపై ఒత్తిడి తేవటం లేదు. పోలవరం ఎత్తు తగ్గించి బహుళార్ధక సాధక ప్రాజెక్టును ఎత్తిపోతల పథకం మార్చిన హీన చరిత్ర జగన్ ది.