విద్యార్థులకు పాఠాలు చెప్పిన కలెక్టర్‌

1

– 5వ విడత గ్రామదర్శినిలో తరకటూరులో పర్యటించిన కలెక్టర్ రంజిత్ బాషా

జిల్లాలో 5వ విడత గ్రామదర్శిని శుక్రవారం నిర్వహించగా, జిల్లా కలెక్టర్: పి. రంజిత్ బాషా గూడూరు మండలం తరకటూరు గ్రామంలో శుక్రవారం పర్యటించి గ్రామంలో సచివాలయం, వైయస్ఆర్ హెల్త్ క్లినిక్, అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక పాఠశాల, జడ్ పి హైస్కూల సందర్శించారు. తొలుత గ్రామ సచివాలయంను సందర్శించిన కలెక్టర్ వివిధ పథకాల లబ్ధిదారులు అనర్ధల జాబితాలు ప్రదర్శించి వాటిని పరిశీలించారు. స్పందన గ్రీవెన్సు పెండింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామంలో ఏ సమస్యలపై ఆర్జీలు వస్తున్నాయి వాటి పరిష్కారం. గురించి అడిగి తెలుసుకున్నారు. నీటి తీరువా పన్ను వసూలు గురించి ఆరా తీశారు. అడంగల్: నమోదై పట్టాదారు పాస్ పుస్తకం ఉండి ఆన్లైన్లో నమోదై ఉన్న వారి నుండి నీటి తీరువా పన్ను వసూలు చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు.

అనంతరం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ను సందర్శించిన కలెక్టర్ గర్భవతులు వారికి అందిస్తున్న. వైద్యం గురించి ఆరా తీశారు. ఎక్స్ పెక్టార్ డేట్ ఆఫ్ డెలివరీ (ఈడీ) రిజిస్టర్ ల్లో నమోదు చేస్తున్నారా లేదా ఆరా తీశారు. గ్రామ పరిధిలో గర్భం దాల్చిన మహిళలు డెలివరీ వరకు వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలు వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. గ్రామ పరిధిలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడీలు ఎంత మందికి జనరేట్ చేశారో ఆరా తీశారు. 1467మందిలో కేవలం 130 మాత్రమే పెండింగ్ ఉన్నాయని మిగతావారందరికి హెల్త్ ఐడిలు జనరేట్చేసినట్లు సిబ్బంది తెలిపారు. అంగన్వాడీ కేంద్రం సందర్శించిన కలెక్టర్ చిన్నారులతో ముచ్చటించారు. చిన్నారులకు, గర్భవతులకు వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పధకం క్రింద అందిస్తున్న ఆహారం మెనూను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు బరువు పరిశీలిస్తున్నాదా లేదా అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల బరువు వయస్సును బట్టి ఎంత ఉండాలి. నిర్దేశించిన బరువు వివరాలతో ఛార్జ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

అనంతరం ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. 1వ తరగతిలో 7 మంది, 2వ తరగతిలో 16 మంది ఎన్రోల్మెంట్ ఉందని ఉపాధ్యాయులు తెలుపుగా, ఒక చిన్నారితో నెంబర్లు వ్రాయించి కలెక్టర్ ఆసక్తిగా గమనించారు. జర్పీ హైస్కూల్ కలెక్టర్ సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో కొంత సేపు గణితంలో ప్రాథమిక అంశాల గురించి కలెక్టర్ విద్యార్థులకు వివరించారు. ఏప్రిల్ 3 నుండి జరిగే 10వ తరగతి, మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ విద్యార్ధులకు సూచించారు. అనంతరం తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అర్బన్, రూరల్ కు త్రాగునీటి సరఫరా విలపింగ్ హౌస్లలను సందర్శించి త్రాగునీటి సరఫరా విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు మచిలీపట్నం నగరంతో పాటు పరిసరా గ్రామాలు, పెడని పట్టడానికి ఇక్కడ నుండే త్రాగునీరు సరఫరా జరుగుతుందని అద్దె కారులు వివరించారు.

గూడూరు జడ్ పిటిసి వేముల సురేష్ రంగ బాబు, మండల పార్టీ అధ్యక్షులు గొరిపరి దేవి, కుమార్. తరకటూరు యంపిటిసి జక్కా ధర్మారాయుడు, విద్యా కమిటీ చైర్మన్ తోట శ్రీను, సర్పంచ్చిన్నం వెంకట రమణమ్మ, తహసిల్దారు ప్రసాద్, ఎంపిడివో సుబ్బారావు, ఇవో ఆర్ డి రజావుల్లా, పంచాయతీ రాజ్, ఎస్.ఈ సత్యనారాయణ రాజు, డిఈ లక్ష్మీనారాయణ. నగర కమీషనర్ చంద్రయ్య,పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్, సంబంధిత మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.