Suryaa.co.in

Andhra Pradesh

‘సారీ’తో తిట్లు సరి!

– టీటీడీ ఉద్యోగికి బోర్డు సభ్యుడు క్షమాపణ

తిరుపతి: తనను లోపలికి వెళ్లనీయకుండా నిలిపివేసిన టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్‌ను దుర్భాషలాడిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్ ఎట్టకేలకు క్షమాపణ చెప్పారు. ఆ మేరకు పాలకమండలి అధికారులు, ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలు ఫలించాయి. బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్ క్షమాపణ చెప్పాల్సిందేనని ఉద్యోగులు పట్టుపట్టి, ఆ మేరకు తొలిసారిగా భారీ స్థాయిలో ధర్నా నిర్వహించడం చర్చనీయాంశమయింది. సహజంగా టీటీడీ యూనియన్ల మధ్య సఖ్యత, ఏకాభిప్రాయం ఉండదు. కానీ అలాంటిది ఈసారి సంఘాలన్నీ ఏకమై.. నరేష్‌కుమార్‌కు వ్యతిరేకంగా ధర్నాలు చేయడం పాలకవర్గాన్ని కలవరపరిచింది. ఇది ముదరకముందే దిద్దుబాటుకు దిగిన పాలకమండలి, రంగంలోకి దిగి దిద్దుబాటుకు దిగింది. దానితో ఉద్యోగికి నరేష్ క్షమాపణ చెప్పడం అనివార్యమయింది

LEAVE A RESPONSE