Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీగా మారింది

-కాంగ్రెస్ నాయకులను ప్రజలు గల్లా పట్టుకుని నిలదీయాలి
– కాంగ్రెస్ పార్టీకి కోనేరు కోనప్ప రాజీనామా
– తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ

సిర్పూర్ కాగజ్ నగర్: మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఇకపై ఏ పార్టీలో చేరబోనని, స్వతంత్రంగా ఉంటానని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి ఆయన మద్దతు ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీగా మారిందని, సిర్పూర్ కాగజ్ నగర్ లో కొత్త బిచ్చగాళ్లు తిరుగుతున్నారని..కాంగ్రెస్ నాయకులను ప్రజలు గల్లా పట్టుకుని నిలదీయాలని కోనప్ప పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీని వీడిన కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసిన ఫ్లై ఓవర్ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో, ఆయన సీఎం రేవంత్ పై ఆగ్రహంతో ఉన్నారు.

LEAVE A RESPONSE