-కాపులంతా వైసీపీ కాపు ఎమ్మెల్యేలు, మంత్రుల కాలర్ పట్టుకుని నిలదీయాలి
-పోలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు
విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఇతర అగ్రవర్ణాల వారి కంటే వెనుక బడి ఉన్న కాపు సామాజికవర్గాన్ని ఆదుకునే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో జుఔూ కోటలో 5% రిజర్వేషన్లు కాపులకు కేటాయించారు. 2019లో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చీ రాగానే కుట్ర పూరితంగా ఆ రిజర్వేషన్లను తొలగించాడు. కాపుల రిజర్వేషన్లు తీసివేయడం ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగ యువతకు జగన్ రెడ్డి తీరని అన్యాయం చేశాడు. కాపులకు 5% రిజర్వేషన్ రద్దుతో గత మూడేళ్లలో విద్యాసంస్థల్లో మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపులకు తీరని అన్యాయం జరిగింది. జగన్ రెడ్డి చెబుతున్న సచివాలయ ఉద్యోగాల్లోనే దాదాపు 13వేల ఉద్యోగాలు కాపు యువత కోల్పోయారు. గెలిపించిన పాపానికి కాపుల గొంతు కోసేందుకు జగన్ రెడ్డి పూనుకునన్నారు.
ఇదేనా జగన్ మోసపు రెడ్డి చెప్పిన సామాజిక న్యాయం
-కాపు యువతకు విద్య ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేసే కుట్రకు పూనుకున్న జగన్మోహన్ రెడ్డి.
-‘రావాలి జగన్ కావాలి జగన్’ అని పాడిన వాళ్ళందరూ ఇప్పుడు ‘ఇక చాలు జగన్, ఇక పో జగన్’ అంటున్నారు. రాజకీయంగా విద్యాపరంగా ఆర్థికంగా కాపులు ఎదగడం జగన్ రెడ్డికి ఏమాత్రం అసలు గిట్టడం లేదు. తన సామాజిక వర్గం ఏమవుతుందో అన్న అభద్రత భావంతో ఉన్న సన్నాసి జగన్ రెడ్డి.
– నామినేటెడ్ పోస్టుల భర్తీలో కావులకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా తన సామాజికవర్గం వాళ్లకే ప్రాధాన్యత కలిగిన అన్ని పోస్టులను జగన్ రెడ్డి అప్పనంగా కట్టబెట్టేశాడు. కనీసం అలాంటి పోస్టులలో 5% కూడా కాపులకు ఇవ్వకుండా జగన్ కాపులపై వివక్ష చూపించాడు.
-జగన్ క్యాబినెట్‌లో మంత్రులైన అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్, కొట్టు సత్యనారాయణ, దాడిశెట్టి రాజా కేవలం జగన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రెడ్లకు కాపు కాస్తూ, బానిస బతుకులు బతుకుతున్నారు.
-పదవులకి కక్కుర్తి పడి తమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించని ఏ ఒక్క కాపు మంత్రీ క్షమార్హుడు కాదు. పదవుల కోసం లాలూచి పడిన ప్రతి ఒక్కరిని కాలర్ పట్టుకొని తమకు దక్కాల్సిన రిజర్వేషన్లు ఏవి అని కాపు సోదరులు గట్టిగా నిలదీయాలి.
– వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకొని జగన్ రెడ్డిపై తిరుగుబాటు చెయ్యాలి.
– తన గెలుపులో కీలకమైన పాత్ర పోషించిన కాపులను చిన్నచూపు చూస్తున్న జగన్ రెడ్డికి ప్రతి ఒక్క కావు సోదరుడు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
– గత మూడేళ్లలో ఎంతమంది కాపు యువత విదేశీ విద్య ఉపకార వేతనాలు పొందారో జగన్ రెడ్డి కావు సమాజానికి తెలియజేయాలి.
– 5% కోటాను అమలు చేయకపోవడం వల్ల గత మూడేళ్లుగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి యువతకు కాలేజీ అడ్మిషన్లలో సీట్లు లేకుండా పోయాయి.