Suryaa.co.in

Andhra Pradesh

సీబీఐ ఛార్జ్ షీట్ లో చెప్పాక కూడా సజ్జల బరితెగించి మాట్లాడితే ఎలా?

• వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్రలేకపోతే, హత్యవార్త తెలిసినవెంటనే అతను వివేకాఇంటికెళ్లి, ఎందుకురక్తపు మరకలు తుడిచేయించాడు?
• జగన్మోహన్ రెడ్డి భార్యభారతి తండ్రి అయిన గంగరెడ్డి ఆసుపత్రినుంచి కాంపౌండర్ నుపిలిపించి శవానికి ఎందుకు కుట్లువేయించాడు?
• సాక్షిమీడియావారికి, జిల్లాఎస్పీకి ఫోన్ చేసి, వివేకా గుండెపోటుతో చనిపోయాడని, మీరెవరూ ఎలాంటివివాదంచేయొద్దని ఎందుకన్నాడు?
• వివేకాహత్యజరిగినప్పుడు చంద్రబాబునాయుడి ప్రభుత్వంలో జరిగే విచారణలపై తనకు నమ్మకంలేదని, సీబీఐ విచారణకావాలని జగన్మోహన్ రెడ్డి కోరలేదా?
• తరువాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వివేకాహత్యకేసు విచారణకు టీడీపీప్రభుత్వం నియమించిన సిట్ పరిధిని ఎందుకుతగ్గించాడో సజ్జలకు తెలుసా?
• ముఖ్యమంత్రి కాగానే గతంలో సీబీఐ విచారణకోరుతూ హైకోర్ట్ లో వేసిన పిటిషన్ ను జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెనక్కు తీసుకున్నాడో సజ్జల చెప్పగలడా?
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ ఎమ్మెల్యే

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అందరూవిస్తుపోయే వాస్తవాలను ఛార్జ్ షీట్ లోనమోదుచేసినప్పటినుంచీ, అధికారంలోఉన్నవారు బరితెగించి మరీ నిస్సిగ్గుగా అబద్ధాలుమాట్లాడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యలు, మాజీశాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరా వు తేల్చిచెప్పారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

నిన్నటికినిన్న ప్రభుత్వసలహాదారుగా ఉన్నవ్యక్తి సీబీఐ విచారణనే తప్పుపడుతూ, సీబీఐ ఛార్జ్ షీట్ నే ఎత్తిచూపేలామాట్లాడాడు. సదరుఛార్జ్ షీట్ లో పేజీనెం 14, పేరాగ్రాఫ్ లోని 16.29లో సీబీఐవారు కడపఎంపీ వై.ఎస్. అవినాశ్ రెడ్డి పేరును ఉదహరిస్తూ,వివేకానందరెడ్డి హత్యజరగడానికి ప్రధా నకారణం కడపఎంపీ టిక్కెట్ వివాదమేనని, ఆటిక్కెట్ అవినాశ్ రెడ్డికి ఇవ్వవద్దని వివేకానందరెడ్డి, జగన్మోహన్ రెడ్డివద్ద పట్టుపట్టా డని పేర్కొన్నారు. కడపఎంపీ టిక్కెట్ తనకురాకుండా వివేకానంద రెడ్డి అడ్డుకున్నాడన్న అక్కసుతోనే అవినాశ్ రెడ్డి ఎర్రగంగిరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, వివేకా మాజీడ్రైవర్ దస్తగిరితోకలిసి వివేకానందరెడ్డిని హతమార్పించాడని సీబీఐ ఛార్జ్ షీట్ లోపేర్కొంటే, దాన్ని తప్పుపడుతూ సలహాదారు సన్నాయినొక్కులు నొక్కడం సిగ్గుచేటు.

ఈ హత్యకేసులో వివేకా నందరెడ్డివద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి అప్రూవర్ గా మారడా న్నిజీర్ణించుకోలేకనే అవినాశ్ రెడ్డి ప్రోద్భలంతో దేవిరెడ్డి శంకర్ రెడ్డి హైకోర్ట్ ని ఆశ్రయించాడు. దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ హైకోర్ట్ లోపిటిషన్ వేస్తే, దాన్నికూడా న్యాయస్థానం మొన్ననే కొట్టేసింది. హత్యకేసువిచారణలో సీబీఐ దూకుడుపెం చడం, ఢిల్లీనుంచీ చౌరాసియా అనేప్రత్యేకాధికారి పులివెందులకు రావడంతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులుకదులుతున్నాయి.

మార్చి 19, 2019నాడు వివేకానందరెడ్డి హత్యోదంతంపై సీబీఐ విచారణజరిపించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన జగన్మోహ న్ రెడ్డి, తరువాత దాన్ని ఎందుకు ఉపసంహరించుకున్నాడో వైసీ పీనేతలు, ప్రభుత్వసలహాదారులు సమాధానంచెప్పాలి. అలానే ఎన్నికలవేళ వివేకాహత్యగురించిన కథనాలు, వార్తలు బయటకు రాకూడదంటూ హైకోర్ట్ ని ఆశ్రయించి, జగన్మోహన్ రెడ్డి గ్యాగ్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాడు. తరువాత ఎన్నికలు ముగిసి అధికారం లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక 2020 ఫిబ్రవరి 6వతేదీన తాను గతంలో సీబీఐ విచారణకోరుతూ వేసిన పిటిషన్ ను ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెనక్కుతీసుకున్నాడో ఆయనగానీ, ప్రభుత్వసలహాదారులుగానీ చెప్పగలరా?

తనబంధువు,ఎంపీ అయిన అవినాశ్ రెడ్డిని వివేకాహత్యకేసు నుంచి తప్పించడానికే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీచేశాడు. అలానే పదేపదే రాష్ట్రప్రయోజనా లపేరుతో ఢిల్లీవెళ్లి, అక్కడకూడా వివేకాహత్యకేసునుంచి తనను, తనపార్టీవారిని బయటపడేయాలని ముఖ్యమంత్రి వేడుకున్నాడని తాము అంటాము. కాదనిచెప్పగల ధైర్యం ప్రభుత్వపెద్దలకు, సలహాదారులకు ఉన్నాయా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణకావాలంటూహైకోర్ట్ లో పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి కాగానే ఎందుకు వెనక్కుతీసుకున్నాడు?

ముఖ్య మంత్రి అయ్యాక తనఅధికారాన్ని ఉపయోగించి, సీబీఐవిచారణ ను అడుగడుగునా అడ్డుకోవడానికే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిం చాడుగానీ, ఏనాడూ విచారణకు సహకరించమని తనకిందఉన్న అధికారయంత్రాంగాన్ని ఆదేశించలేదు. వివేకాహత్యజరిగిన వెంటనే అడిషనల్ డీఐజీ స్థాయి అధికారితో విచారణకు నాటి ముఖ్యమంత్రి సిట్ బృందాన్ని నియమిస్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే సిట్ కు నేతృత్వం వహిస్తున్న అధికారిని మార్చి, ఎస్పీస్థాయి అధికారికి ఎందుకు బాధ్యతలు అప్పగించాడో సజ్జల సమాధానంచెప్పాలి?

అలాగే వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, హత్యజరిగిన 7నెలల తరువాత సహనం నశించి,28-01-2020న హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. తనతండ్రి వివేకానందరెడ్డి హత్యకేసువిచారణ ను సీబీఐకి అప్పగించాలంటూ జగన్మోహన్ రెడ్డి సొంతచెల్లే కోర్టుకి వె ళ్లిందంటే, తనఅన్నపై నమ్మకంలేకపోబట్టేకదా…ఇలాంటి అనేక అంశాలు వివేకానందరెడ్డి హత్యలో ముఖ్యమంత్రి ప్రమేయాన్ని వేలిత్తిచూపుతుంటే సిగ్గులేకుండా ప్రభుత్వసలహదారు సజ్జల ఇంకా సీబీఐని తప్పుపడుతూ బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయ త్నిస్తున్నాడు.

వివేకానందరెడ్డి హత్యజరిగినతర్వాత తెల్లారి 6గంటలకే అవినాశ్ రెడ్డి మృతుడి ఇంటికి ఎందుకు వెళ్లాడో, అక్కడఉన్న పనిఅమ్మా యితో రక్తపుమరకలుఎందుకు తుడిపించాడో సజ్జల సమాధానం చెప్పగలడా? అలానే మృతదేహానికి కుట్లు వేయించడానికి, జగన్మోహన్ రెడ్డి భార్యఅయిన భారతి తండ్రి గంగిరెడ్డి ఆసుపత్రి నుంచే కాంపౌండర్ ను ఎందుకు పిలిపించారో, అతనితో మృతదేహా న్ని శుభ్రంచేయించి గాయాలకు కుట్లుఎందుకు వేయించారో సజ్జ లకు తెలుసునా అనిప్రశ్నిస్తున్నాం.
ఆ విధంగా కళ్లముందే దగ్గరుండిమరీ ఆధారాలన్నీ చెరిపేయించింది అవినాశ్ రెడ్డేనని, 06.15 నిమిషాలకు వివేకాహత్యవార్త బయటకువస్తే, 06.30 ని. లకే అవినాశ్ రెడ్డి వివేకానందరెడ్డి ఇంటికెళ్లాడని, రక్తపుమరకలు తుడిపేయించి, ఇతరత్రాఆధారాలు మాయంచేసి, గుండెపోటుతో చనిపోయాడనిచిత్రీకరించాడని సీబీఐ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఉంటే, సజ్జల ఏమని సీబీఐవారిని ప్రశ్నిస్తాడు?

ఆధారాలు చెరిపేయిస్తున్న సమయంలో అవినాశ్ రెడ్డితో పాటు సీబీఐ నిందితులుగా పేర్కొన్న గంగిరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ అందరూ అక్కడే ఉన్నారు.
వివేకాహత్య జరిగాక తొలుత సాక్షిమీడియాలో దాన్ని గుండెపోటుగా ప్రచారంచేయించి న జగన్మోహన్ రెడ్డి, తరువాత అవినాశ్ రెడ్డిని కాపాడటానికి ఆ నేరాన్ని నాటిముఖ్యమంత్రి చంద్రబాబునాయడుపై, ఆయన కుమారుడు లోకేశ్ పై వేయడానికి ప్రయత్నించాడు. అసలు వివేకా గుండెపోటుతో చనిపోయాడనిచెప్పింది తొలుత అవినాశ్ రెడ్డే. స్వయంగా ఆయనే జిల్లాఎస్పీకి ఫోన్ చేసి, వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని, పోలీసుల విచారణ అవసరంలేదని , తామే అన్నికార్యక్రమాలు ముగిస్తామనిచెప్పింది నిజమా..కాదా?

వివేకాహత్యలో పాల్గొన్నవారిని, హత్యచేయించినవారిని కాపాడ టానికే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నా రని వారివైఖరితోనే తేలిపోతోంది. అవినాశ్ రెడ్డిని తప్పించడానికే జగన్మోహన్ రెడ్డి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్ ను వెనక్కుతీసుకున్నాడు. అవినాశ్ రెడ్డిని తప్పించడానికే సిట్ పరిధి తగ్గించి, ఎస్పీ స్థాయి అధికారికి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. అవినాశ్ రెడ్డి అరెస్ట్ అయితే తరువాత తనమెడకే వ్యవహారం చుట్టుకుంటుందనే జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీవెళ్లిమరీ వివే కాహత్యకేసు విచారణలోసీబీఐ దూకుడుతగ్గించేలా చేశాడు.

పదేపదే ప్రధానిమోదీ, అమిత్ షాలకు మొరపెట్టుకొని వివేకా హత్యకేసు తనమెడకుచుట్టుకోకుండా చూడాలని వారిని ప్రాధేయ పడ్డాడు. వివేకాహత్యను ఎన్నికల్లో తనగెలుపుకోసం వాడుకొని, ముఖ్యమంత్రి అయ్యాక తన అధికారాన్ని ఉపయోగించి, అడుగ డుగునా విచారణను జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడనేది నూటికి నూరుశాతం వాస్తవం. సీబీఐ వివేకాహత్యకేసువిచారణలో తక్షణమే అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించాలి. తరువాత అవినాశ్ రెడ్డిని కాపాడటానికి ప్రయత్నించడంతోపాటు, సీబీఐ విచారణకావాలని, తరువాతవద్దని కోరిన జగన్మోహన్ రెడ్డి ప్రమేయంపైకూడా విచారణ జరపాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

LEAVE A RESPONSE