అణగారిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన అంబేద్కర్

-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
విజయవాడ : భారత రాజ్యంగ రూపకర్త డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఇందిరా భవన్ లో సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ అంబేద్కర్ చేసిన సేవల్ని స్మరించుకోవాలని, భావి సమాజానికి ఆ మహోన్నత వ్యక్తి నెలకొల్పిన విలువల్ని అందించాలన్నారు. దేశంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసి, నేడు వెనుకబడిన, బలహీన వర్గాలు స్వయం సంవృద్ధి దిశగా రాణించడానికి కారకుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. స్వేచ్ఛ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం దేశ ప్రజలందరికీ అందించడమే అసలైన అభివృద్ధి అని చెప్పిన మహనీయులు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ అని శైలజనాథ్ అన్నారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పాలకులు అందుకు భిన్నంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమం నిధులను సైతం పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరవాలని, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పాటుపడాలని ఆయన కోరారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మహనీయుని ముందు చూపువల్లే నేడు మన దేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నాయని, అందువల్లే సమాజంలో దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు అవకాశాలు లభిస్తున్నాయన్నారు.

Leave a Reply