డెలివరీ భాగస్వామి నెట్‌వర్క్‌ను మూడింతలకు పెంచాలని యోచిస్తున్నబోర్జో

గ్లోబల్ఇంట్రా-సిటీసేమ్-డేడెలివరీసర్వీస్ అయిన బోర్జో, హైదరాబాద్‌లోతన సేవలను విస్తృతంగా బలోపేతం చేయడానికి, హైదరాబాద్‌లోని చిన్న, మధ్యతరహా సంస్థలు, D2C బ్రాండ్‌లు, హైపర్ లోకల్ విభాగాలపై దృష్టి పెట్టేందుకు తన ప్రణాళికలను ప్రకటించింది.

ప్రస్తుతం, బోర్జో హైదరాబాద్‌లో 1000మంది రైడర్‌ల డెలివరీ ఫ్లీట్‌ను కలిగి ఉంది. సంవత్సరం చివరినాటికి హైదరాబాద్‌లో డెలివరీ భాగస్వామి నెట్‌వర్క్‌ను మూడింతలకు పెంచాలని యోచిస్తోంది. బోర్జో హైదరాబాద్‌ను దక్షిణ భారతదేశానికి తన ప్రవేశద్వారంగా చూస్తుంది. ఈ నగరం దక్షిణభారతదేశంలోని తన అతి పెద్ద పట్టణమార్కెట్‌లో ఒకటిగా మారాలని భావిస్తోంది.ఈ నగరం తన ఆదాయానికి గణనీయంగా దోహద పడుతుందని ఆశిస్తోంది. బోర్జో నగరంలోని అన్ని పిన్‌కోడ్‌లకు సేవలు అందించడం, హైదరాబాద్ ఆధారిత చిన్న, మధ్యతరహా సంస్థలు, ఎంటర్‌ప్రైజెస్, D2C బ్రాండ్‌లు, హైపర్ లోకల్ విభాగాల కోసం తిరుగులేని చివరి అంచె డెలివరీలను ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్ పెరుగుతున్నందున, సరసమైన, సమర్థవంతమైన డెలివరీ సేవలకు డిమాండ్ పెరుగుతోంది. బోర్జో ఈ అవసరాన్ని గుర్తించింది. చివరి మైలు డెలివరీ విభాగంలోని ఖాళీని పూరించడానికి కట్టుబడి ఉంది. B2B, హైపర్ లోకల్ డెలివరీలను క్రమబద్ధీకరించడానికి సాంకేతికత, API, డెలివరీ భాగస్వామి నెట్‌వర్క్‌ను మెరుగుపరచడం ద్వారా హైదరాబాద్‌లో తన సేవలను విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. బోర్జో మరిన్ని సంస్థలను చేరుకోవడానికి తన మార్కెటింగ్ ప్రయత్నాలను పెంచడంలో పెట్టుబడి పెడుతుంది. వేగవంతమైన, విశ్వసనీయమైన డెలివరీలను నిర్ధారించడానికి అదనపు డెలివరీ భాగస్వాములను తనతో కలసి ప్రయాణించేలా చేస్తోంది. అలా చేయడం ద్వారా, హైదరాబాద్‌లోని కస్టమర్‌లకు తిరుగులేని, అవాంతరాలులేని డెలివరీ అనుభవాన్నిఅందించాలని బోర్జో లక్ష్యంగా పెట్టుకుంది.

హైదరాబాద్‌పై దృష్టిని పెంచడం అనేది బోర్జో దీర్ఘకాలిక విస్తరణ వ్యూహంలో భాగంగా ఉంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని వివిధ నగర మార్కెట్‌లలో కార్యకలాపాల సాంద్రతను పెంచడం అనేది భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా బోర్జో అసాధారణవృద్ధికి కారణంగా నిలుస్తోంది. ఈ ఏడాది హైదరాబాద్‌లోబోర్జోతన ఫ్లీట్నుఎలక్ట్రిఫై చేసేందుకు కృషి చేస్తోంది.

‘‘హైదరాబాద్ లో బోర్జోది ఒక వ్యూహాత్మక మార్కెట్. అది దక్షిణ భారతదేశంలోతన ఉనికిని బలోపేతం చేయాలని చూస్తోంది. హైదరాబాద్‌లో కార్యకలాపాల సాంద్రతను విపరీతంగా పెంచడానికి మేం మా పెట్టుబడులను పెంచుతాం. మేం హైదరాబాద్‌లో అపారమైన సామర్థ్యాన్ని చూస్తున్నాం, అందువల్ల ఇది జరగుతోంది. దక్షిణభారతదేశానికి మా గేట్‌వే ఈ నగరం. ఇక్కడ డెలివరీ సేవలలో చివరి మైలు అంతరాన్నితగ్గించడం, మాB2B, హైపర్-లోకల్ కస్టమర్‌లకు తిరుగులేని డెలివరీ అనుభవాన్ని అందించడం మాలక్ష్యం. హైదరాబాద్‌లోమా సేవలను బలోపేతం చేయడం మా ఆశయం.రాబోయే3 త్రైమాసికాల్లో, ఆ తరువాతి కాలంలో తెలంగాణలో నిద్వితీయ శ్రేణి నగరాల వైపు వెళ్లాలని యోచిస్తున్నాం. మేం హైదరాబాద్‌లోఈ సంవత్సరం చివరినాటికి మా డెలివరీ వర్క్‌ఫోర్స్‌ను 30% పెంచాలని చూస్తున్నాం” అని బోర్జో ఇండియా జనరల్ మేనేజర్ యూజీన్ పంఫిలోవ్ చెప్పారు.

భారతదేశంలో, బోర్జో ఇటీవల 8 కొత్త నగరాలకు- అమృత్‌సర్, గౌహతి, జోధ్‌పూర్, కోటా, లక్నో, ఉదయపూర్ ,డెహ్రాడూన్‌- విస్తరించింది. ఇప్పుడు ముంబై, దిల్లీ/ఎన్సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, పుణె, సూరత్, జైపూర్, గోవా, కాన్పూర్, ఇండోర్, భోపాల్, చండీగఢ్ సహా 22 నగరాల్లో ఉనికిని కలిగి ఉంది.

Leave a Reply