Suryaa.co.in

Andhra Pradesh

మ‌సులా బీచ్ ఫెస్ట్ కు బ్ర‌హ్మ ర‌థం

– మంత్రులు కొల్లు రవీంద్ర, పి. నారాయణ, కొలుసు పార్థసారథి

మచిలీపట్నం: మసులా బీచ్ ఫెస్టివల్ కి ఊహకు అందని విధంగా పర్యాటకులు రావ‌డం సంతోష‌దాయ‌క‌మ‌ని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు ర‌వీంద్ర అన్నారు. మచిలీపట్నం బీచ్ లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్ కి నిర్వహణకు సంబంధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారన్నారు.

టూరిజం అభివృద్ధికి ఈ బీచ్ ఫెస్టివల్ తొలి మెట్టు అన్నారు. గతంలో బీచ్ ఫెస్టివల్ అంటే గోవాకు, శ్రీలంకు వెళ్లాల్సి వచ్చేదని…ఇప్పుడు ఆ అవసరం లేదన్నారు. అమరావతి నిర్మాణానికి మచిలీపట్నం బీచ్ దగ్గరగా ఉందన్నారు.

పోర్టు కూడా త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. అమరావతి మహిళలపై జరుగుతున్న దుష్ప్రచారంపై మాట్లాడుతూ దుర్మార్గమైన వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడతారన్నారు. ఓటుతో ప్రజలు చీ కొట్టినా వారికి సిగ్గు రాలేదన్నారు. మహిళలు అనే గౌరవం కూడా వారికి లేదన్నారు.

మున్సిపల్ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ ని ఎంతో అద్భుతంగా చేస్తున్నార‌న్నారు. కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నారన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రిలాక్స్ అయ్యానన్నారు. 80 అడుగుల ఎత్తుతో గేట్ వే ఆఫ్ నిర్మాణం చేశారన్నారు. 10 ఏళ్ల వరకు ఎవరు కదపలేని విధంగా నిర్మాణ చేశారన్నారు. రోల్డ్ గోల్డ్, కలంకారి, వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు.

సినీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. 24 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారన్నారు. 2018లో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ కి 10 లక్షల మంది వచ్చారన్నారు. ఈసారి 20 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నామ‌న్నారు.. సీఎం చంద్రబాబు నాయుడు పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తారన‌న్నారు. రాష్ట్రాల అభివృద్ధిలో పర్యాటక రంగం కీలకమైందన్నారు. మాజీ సీఎం జగన్ కి ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదన్నారు. వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థను చిన్నభినం చేశారన్నారు. 10 లక్షల కోట్ల అప్పులు చేశాడన్నారు.

ప్రతి మీటింగ్ లో కూడా పర్యాటక రంగంలో కొత్త ప్రాజెక్టులు ఏమన్నా వచ్చాయో అని సీఎం చంద్రబాబు అడుగుతారన్నారు. రాష్ట్రానికి 8 వేల 500 కోట్లు అమృత స్కిన్ కింద కేంద్రం ఇచ్చిందన్నారు. మచిలీపట్నం డంపింగ్ యార్డు పనులు జరుగుతున్నాయన్నారు. అక్టోబర్ 2కి పూర్తి చేస్తామ‌న్నారు.

స‌మాచార పౌర‌సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ‌ల మంత్రి కొలుసు పార్ధ సారథి మాట్లాడుతూ, కృష్ణాజిల్లా వాసిని అయినా బీచ్ ఫెస్టివల్ ఇంత ఘనంగా చేస్తారని ఎప్పుడూ చూడలేదన్నారు. కేవలం 5 రోజులకే ఇంత మంది పర్యాటకులు వస్తే ఇక్కడ శాశ్వత ఏర్పాట్లు చేస్తే ఎంత మంది నిత్యం వస్తారన్నారు. టూరిజం అభివృద్ధి చేస్తే రాష్ట్ర జిడిపి పెరుగుతుందన్నారు. ప్ర‌తిప‌క్ష‌ నేతలు అమరావతి బ్రాండ్ దెబ్బ తియ్యాలని చూస్తున్నారన్నారు. ఆ నేతల తీరును ప్రజలు ఆలోచన చేయాలన్నారు.

మంత్రి నారా లోకేశ్ 6 పాలసీలను తీసుకు వచ్చాన‌న్నారు… వాటిల్లో ముఖ్యమైనది మహిళల అభ్యున్నతి, మహిళలు కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. సభ్య సమాజం సిగ్గు పడేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తోంది, ప్రపంచంలో పేరెన్నిక కన్న సంస్థలు అమరావతికి వచ్చేందుకు చూస్తున్నారన్నారు. అమరావతిపై లేని కట్టు కథలు సృష్టిస్తున్నారన్నారు. మహిళలపై వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు చీ కొట్టినా ఇంకా మారకపోతే ఎలా , వారు ఎన్ని ఏడ్పులు ఏడ్చినా రాష్ట్రాభివృది ఆగదన్నారు. కార్య‌క్ర‌మంలో శాప్ చైర్మ‌న్ అనిమిని నాయుడు, మాజీ డిప్యూటీ స్పీక‌ర్‌ బూరగ‌డ్డ వేద‌వ్యాస్ త‌దిత‌ర‌లు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE