– బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
లాస్య నందిత మరణ వార్త మాకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బీజేపీ యాత్రకు మంచి స్పందన వస్తుంది.45 అసెంబ్లీ స్థానాలలో 6 పార్లమెంట్ స్థానాలలో యాత్ర ముగిసింది.ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా యాత్రలో పాల్గొంటున్నారు. రాముని గుడి కట్టారని పల్లెల్లో ప్రజలు బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. రాముని ప్రాణ ప్రతిష్ట కు రాని కాంగ్రెస్ పై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు.
మంత్రులు,ముఖ్యమంత్రులు వారి స్థాయిని తగ్గించుకొని బీజేపీపై నీచంగా మాట్లాడుతున్నారు. బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు తీసుకొస్తుంది.ప్రజలకిచ్చిన హామీలను మర్చిపోయేలా బీజేపీ పై అనవసర దాడులు కాంగ్రెస్ చేస్తుంది.బస్సు యాత్ర స్పందన చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతున్నారు.
కాంగ్రెస్ వచ్చిందంటే అవినీతి పాలనకు గారంటీ అని అర్థం.హామీల విషయంలో అవసరం తీరాక ఒకలా..తీరకముందు ఒకలా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. నా పర్యటనలో చూసా ..సీతారామపురం లో 1100 ఎకరాల భూమిని అప్పనంగా గత ప్రభుత్వం దోచుకుంది.రెండు మాసాలు గడచినా రుణ మాఫీ, రైతు బందు,ఇచ్చిన హామీలు ఎందుకు ఇవ్వడంలేదు? పార్లమెంట్ ఎన్నికల పేరుతో కాంగ్రెస్ కాలయాపన చేస్తుంది. విభజన హామీలలో భాగంగా ములుగులో ట్రైబల్ ఇనిస్టిట్యూట్ కేంద్రం మంజూరు చేసింది.