జగన్ రెడ్డి అక్రమ ఇసుక దోపిడిపై రేపు టీడీపీ,జనసేన ఆందోళనలు

– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ ఇచ్చిన ఉచిత ఇసుకను రద్దు చేసి ఇసుక మాఫియాతో జగన్ రెడ్డి 5 ఏళ్లలో రూ. 50 వేల కోట్లు లూఠీ చేశారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని అక్రమ తవ్వకాల ఫోటోలు, నకిలీ బిల్లు పుస్తకాలు, తదితర ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్), ఎన్జీటి నిర్దారించాయి. అయినా జగన్ రెడ్డి ఇసుక దోపిడి మాత్రం ఆపటం లేదు.

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల కనుసన్నల్లో 500 కి పైగా రీచ్ ల్లో అక్రమంగా ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఈ అక్రమ ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతాల్లో రేపు (24.02.2024) రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ, జనసేన శ్రేణులు రీచ్ ల వద్ద నిరసనలు తెలపటంతో పాటు వైసీపీ అక్రమ ఇసుక దోపిడిని ఫోటోలు, సెల్పీల రూపంలో ప్రజల్లో ఎండగట్టాలి.

Leave a Reply