-ప్రజలు తిరుగుబాటు చేస్తే పోలీసులు కుడా ఏం చేయలేరు జగన్ రెడ్డి
– ఈ రాష్ట్రం వదిలి పరుగులు పెడతావు
– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
కంచికచర్ల టౌన్ : కంచికచర్ల టౌన్ అంబేద్కర్ కాలనీ నందు సోమవారం నాడు రాత్రి స్థానిక తెదేపా నేతలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ.. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ పోస్టర్ ను ఆవిష్కరించిన అనంతరం ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ఏమన్నారంటే…
మెట్ట ప్రాంతం తెదేపా హయాంలో నీరు ఇచ్చి రెండు, మూడు పంటలు పండించేవారు, ఇప్పుడు రెండో పంటకు నీరు ఇచ్చే దిక్కు లేదు. ఎన్టీ రామారావు , చంద్రబాబు నాయుడు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఇచ్చిన పింఛన్లు తీసివేయడానికి నువ్వు ఎవరివి?
బియ్యం తప్ప ఏం ఇవ్వడం లేదు, పప్పు ఉప్పు ఉండేవి, పేదవాడు ఆనందంగా పండుగ జరుపుకోవడానికి సంక్రాంతి కానుక ఇవ్వడం లేదు.చంద్రన్న భీమా పెళ్ళి కానుక ఎస్పీ కార్పొరేషన్ లోన్లు బీసీ కార్పొరేషన్ లోన్లు ఏ ఒక్కటి ఇవ్వడం లేదు.మనం కట్టిన ఇళ్ళు,వేసిన రోడ్లు లైట్లు తప్ప పెద్దగా ఈ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిందేమీ లేదు.
ఊరిలో రోడ్లు వెయ్యాల్సిన డబ్బులు సచివాలయాలు కడుతున్నారు, వాలంటీర్లకు డబ్బులు ఇస్తున్నారు.ప్రజలు తిరుగుబాటు చేస్తే పోలీసులు కుడా ఏం చెయ్యలేరు జగన్ రెడ్డి. ఉద్యోగస్తులకు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు,9 లక్షల కోట్ల రూపాయల అప్పు అయ్యింది. ప్రజా ధనాన్ని అంతా వాళ్ళ శిలాఫలకాలకు, వాళ్ళ పేర్లకు ఉపయోగిస్తున్నారు. ఈ భారం అంతటిని పన్నుల రూపంలో మరల మన వద్ద నుంచే వసూలు చేస్తూ తాటతీస్తున్నారు.. రాష్ట్రం అంధకారంలోకి వెళ్లకుండా ఉండాలంటే సైకో పోవాలి.. సైకిల్ రావాలి.