అన్నమయ్య ప్రాజెక్ట్‌ తెగిపోవడం ప్రభుత్వ వైఫల్యమే: చంద్రబాబు

Spread the love

కడప : భారీ వర్షాలకు జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్ట్‌ తెగిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. భారీ వర్షాలకు నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు టీడీపీ తరపున రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.1000 ఆర్థికసాయాన్ని చంద్రబాబు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజల ప్రాణాలను బలి చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌రెడ్డి ఆకాశంలో విహరిస్తే వరద భాదితుల కష్టాలెలా తెలుస్తాయని ప్రశ్నించారు. వరదల్లో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షలివ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Leave a Reply