ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాజీనామా చేసిన వైసిపి సర్పంచులు

గ్రామపంచాయతీలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైకాపా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైసిపి సర్పంచులు.సర్పంచ్ గా గెలిచిన అప్పటినుండి ప్రజలకు ఏదో చేయాలని నూతనోత్సాహంతో ఉన్న సర్పంచ్లకు నియంతృత్వ పోకడల వల్ల కనీసం గ్రామ సచివాలయ నిర్వహణ వీధి దీపాలు రోడ్డు మరమ్మతులు కనీసం తాగునీటి మోటార్లకు రిపేర్ కి సంబంధించి ఖర్చు కూడా చెల్లించలేని పరిస్థితిలో గ్రామ పంచాయతీలు ఉండటం దురదృష్టకరమని అలాగే 14వ 15వఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలలో లేకుండా వేసినట్లే వేసి గ్రామపంచాయతీ అకౌంట్లలోఒక్క రూపాయి కూడా లేకుండా దారి మళ్ళిండాము, అలాగే సంక్షేమ పథకాలు పూర్తిగా సర్పంచ్ పాత్ర లేకుండా చేయడం వంటి వాటికి నిరసనగా వైసిపి పార్టీ సభ్యత్వం కలిగిన సర్పంచులు అందరూ వైసిపి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాజీలేని పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఖాజీపేట పరిధిలోని 13 మంది సర్పంచులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు సర్పంచులు అందరమూ సిద్ధమవుతున్నట్లు వారు అన్నారు. సర్పంచుల గెలిచి ఇప్పటివరకు ఎనిమిది నెలలు అయినప్పటికీ ఒక్క రూపాయి కూడా గ్రామ అవసరాలకు ఖర్చు పెట్టేందుకు పంచాయతీల లో డబ్బులు లేక పోవడం చాలా దారుణం అని ఇప్పటినుండి ఎలాంటి శానిటేషన్ ,మోటారు మరమ్మతులు, వీధి దీపాల మరమ్మతులు చేయకుండా బహిష్కరిస్తున్నామని తెలిపారు.

Leave a Reply