Suryaa.co.in

Andhra Pradesh

మళ్ళీ గ్రామపంచాయతీల నిధులు తీసివేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు Y.V.B. రాజేంద్ర ప్రసాద్
మళ్ళీ గ్రామపంచాయతీల నిధులు సుమారు రూ.3000 వేల కోట్లు తీసివేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. 6 నెలల క్రితం ఇదేవిధంగా రూ.450 కోట్లు తీసివేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. గ్రామాలలో రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, శానిటేషన్, లైటింగ్ మొ,,లగు చేయడానికి ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం 14, 15 వ ఆర్థిక సంఘాల ద్వారా గ్రామ పంచాయతీలకు కేంద్రం పంపిన నిధులవి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయి, సర్పంచ్ లు ఉత్సవ విగ్రహాల్లాగా మారిపోయారు. తిరిగి ఆ నిధులు ఇచ్చేయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది అన్యాయం! అక్రమం!! రాజ్యాంగ వ్యతిరేకం – దీనికి వ్యతిరేకంగా మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ పోరాడుతుంది, హై కోర్టులో కేసులు వేస్తోంది.
గ్రామాల అభివృద్ధి కోసం 15 వ ఆర్థిక సంఘం సిపార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని 13,000 వేల గ్రామపంచాయతీలకు మొదటి విడతగా సుమారు 3000 వేల కోట్లు పంపినది. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం CFMS అకౌంట్ లో వేసుకొని ఆ నిధులు దారి మళ్లించి, తన స్వంత అవసరాలకు వాడేసుకొని ( 21-11-2021) న ఆ నిధులను CFMS అకౌంట్ లలో జీరో బ్యాలన్స్ క్రింద చూపిస్తోంది. ఆ నిధులున్నాయని గ్రామాలలో ప్రస్తుతం సర్పంచ్ లు అనేక పనులు చేసియున్నారు. మరి ఆ నిధుల బ్యాలన్స్ జీరో అవ్వడంతో సర్పంచ్ లు తల్లడిల్లిపోతున్నారు.
సర్పంచ్ లకు చెప్పకుండా, కనీసం తెలియజేయకుండా వారి అనుమతి, గ్రామ పంచాయతీల తీర్మానం లేకుండా పంచాయతీల స్వంత నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి ఎలా వాడేసుకుంటుంది?. గతంలో కూడా సుమారు 4 నెలల క్రితం 14 వ ఆర్థిక సంఘం నిధులు, పంచాయతీల జనరల్ ఫండ్స్ సుమారు రూ,,450 ల కోట్లను విద్యుత్ బకాయిల క్రింద అంటూ ఇదే విధంగా సర్పంచ్ లకు చెప్పకుండా దారి మళ్ళించి తీసివేసుకొంది .
గ్రామాల అభివృద్ధి కి రాష్ట్ర ప్రభుత్వం తన స్వంత నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దారి మళ్లించి తన స్వంత అవసరాలకు వాడుకోవడం దారుణం . గ్రామ పంచాయతీల స్వంత నిధులను ఈ విధంగా దొంగచాటుగా లాగివెసుకోవడం అత్యంత సిగ్గు చేటు. వెంటనే ఆ నిధులను తిరిగి పంచాయతీ లకు జమ చెయ్యవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ పోరాటాలు చేస్తుంది. కోర్టులో కేసులు కూడా వేస్తాం . ఈ ఉద్యమానికి, పోరాటానికి రాష్ట్రంలోని సర్పంచ్ లందరూ రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ఐక్యంగా కలిసి ముందుకు రావాల్సిందిగా మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ విజ్ఞప్తి చేస్తోంది.

LEAVE A RESPONSE