– మత్య, పాడి, పశు సంవర్ధక యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
మహబూబ్ నగర్: ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండలం బొల్లారం గ్రామంలో కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కోయిల సాగర్ రిజర్వాయర్లో 12 లక్షల రూపాయలతో 7లక్షల 77 వేల చేప పిల్లలకు గాను మొదటి విడతగా 2 లక్షల 50 వేల చేప పిల్లలను పంపిణీ చేశారు. మిగతావి రెండు దశల్లో విడుదల చేస్తారు. ఈ సందర్భంగా కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం దాదాపుగా 123 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.
94 కోట్ల రూపాయలతో 84 కోట్ల చేప పిల్లలను రాష్ట్రంలోని దాదాపుగా 26000 నీటి వనరుల్లో,29 కోట్ల రూపాయలతో 300 చెరువులలో 10 కోట్ల రొయ్యలను వంద శాతం సబ్సిడీ తో విడుదల చేస్తున్నామని తెలిపారు.చేపల పెంపకంతో మత్స్యరంగంపై ఆధారపడ్డ 5 లక్షల మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక అభివృద్ధి,జీవనోపాధి కలుగనున్నట్లు తెలిపారు.మక్తల్ నియోజకవర్గంతో పాటు దేవరకద్ర, నారాయణపేట నియోజకవర్గాల అభివృద్ధికి తాను ప్రాధాన్యతనిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక దేవరకద్ర శాసన సభ్యులు జి.మధు సూదన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మత్స్య శాఖ డి.డి.ఖదీర్ అహ్మద్,మత్స్య శాఖ ఏ .డి. రాధా రోహిణి,మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు