– బ్రహ్మంగారి మఠం సంరక్షణకు తక్షణ చర్యలు
– తాతగారి ఆధ్యాత్మిక వారసత్వం
బ్రహ్మంగారి మఠం వైశిష్ట్యం!
ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక చరిత్రలో కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ఒక యుగపురుషుని మహాక్షేత్రం. ఇక్కడ కొలువైన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి (క్రీ.శ. 17వ శతాబ్దం) కేవలం ఒక యోగి మాత్రమే కాదు, కుల వివక్షను రూపుమాపి, సమసమాజ స్థాపనకు కృషి చేశారు.
స్వామివారు కందిమల్లయపల్లెలో జీవసమాధి నిష్టనొందిన స్థలమే కాలక్రమంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. ఆయన రచించిన ‘కాలజ్ఞానం’ భవిష్యత్ పరిణామాలను ప్రవచించి, ఈ క్షేత్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది.
లోకేష్ కుటుంబానికి అనుబంధం: తాతగారి నట వారసత్వం
బ్రహ్మంగారి మఠంతో మంత్రి నారా లోకేష్ కుటుంబానికి ఒక చారిత్రక, కళాత్మక అనుబంధం ఉంది. లోకేష్ తాతగారు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) , ఆ మహానుభావుడి జీవిత చరిత్రపై “శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర” (1984) చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించడమే కాక, ముఖ్య పాత్రను పోషించారు.
వీరబ్రహ్మేంద్రస్వామి బహుశ ఇలాగే ఉండునేమో అన్నట్టు ఎన్టీఆర్ గారు ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. అంతేకాక, ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుగంగ పథకంలో భాగంగా మఠాన్ని ఆనుకుని ఉన్న జలాశయానికి ‘బ్రహ్మం సాగర్’ అని నామకరణం చేసి, మఠం పట్ల తన భక్తిని చాటుకున్నారు.
పాలకుల బాధ్యత: వారసత్వంపై లోకేష్ తక్షణ ఆదేశం!
ఇలాంటి అత్యంత విలువైన వారసత్వ క్షేత్రం, గత ప్రభుత్వ హయాంలో అధికారుల నియామకాలలో స్థిరత్వం లేమి కారణంగా సంరక్షణకు నోచుకోకపోవడం విచారకరం. ఈ నేపథ్యంలోనే…
బ్రహ్మంగారి మఠం సంరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ కడప జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ విలువైన వారసత్వ స్థలాన్ని కాపాడటం అత్యవసరం అని ఆయన నొక్కిచెప్పారు.
తాతగారు తెరపై బ్రహ్మంగారి రూపంలో నటిస్తే, మరో బ్రాహ్మ గారి వారసుడు, మనవడు పీపీఎన్ ప్రసాద్ కోర్టులకు వెళ్లి విజయం సాధించిన కీలక పాత్ర పోషించడం.. ఇలా మఠంతో అనుబంధం ఉన్న ప్రజల ఆవేదనను దృష్టిలో ఉంచుకుని, లోకేష్ తక్షణ చర్యలకు ఆదేశించడం వారసత్వ సంరక్షణకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది.