Suryaa.co.in

Telangana

బిఆర్ఎస్ సభ సాంప్రదాయాలను మార్చింది

– అసెంబ్లీలో శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైద‌రాబాద్‌: బిఆర్ఎస్ సభ సాంప్రదాయాలను మార్చింది. సంస్కరణలు చేపట్టి సభ ఔన్నత్యాన్ని కాపాడుతాం. అందరితో మాట్లాడి క్రమేణా సభ ఎక్కువ రోజులు నడిపించేందుకు ప్రయత్నం చేస్తాం. గత పది సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ సభ సాంప్రదాయాన్ని, రూల్స్ ను మార్చిందని, సభ రూల్స్ ను నిర్వీర్యం చేసిందన్న మాట వాస్తవమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

శాసనసభ ఎన్ని రోజులు జరగాలి అన్నది బిఆర్ఎస్ పాలనలో స్పష్టత లేదన్నారు. సభ జరగాల్సిన అన్ని రోజులు పూర్తిగా జరగాలని మేం కోరుకుంటున్నామని అన్నారు. గతంలో వేసవికాలం, చలికాలం సమావేశాలకు సంబంధించి ముందుగానే సభా వ్యవహారాల షెడ్యూల్ ఖరారు అయ్యేదన్నారు. మేం మళ్లీ సంస్కరణలు చేపట్టి సభ ఔన్నత్యాన్ని కాపాడుతామన్నారు. అందరితో మాట్లాడి భవిష్యత్తులో సభ సమయాన్ని క్రమేణ పెంచడానికి ప్రయత్నం చేస్తామన్నారు.

LEAVE A RESPONSE