దేశ నిర్మాణంలో అద్భుతమైన పాత్ర పోషించిన ఇంజనీర్ విశ్వేశ్వరయ్య

దేశ ఆర్థికవనరులు ఇక్కడి ప్రజలకే ఉపయోగపడాలన్న ఆయన తపన ఎనలేనిది
ప్రతి ఇంజనీర్ విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి
కెసిఆర్ నాయకత్వంలో విశ్వేశ్వరయ్య స్ఫూర్తితోనే విద్యుత్ రంగంలో అద్భుతాలు
నాయకునికి దార్శనికత పరిపాలనదక్షిత ,ప్రజలపై ప్రేమ ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి తెలంగాణ రాష్ట్రమే నిదర్శనం
కెసిఆర్ దార్శనికతే విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన విజయానికి కారణం
తలసరి విద్యుత్ వినియోగం,ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ ఉండడానికి కారణం కేసీఅర్ విజన్
హైదరాబాద్ , ఎర్రగడ్డ లోని తెలంగాణ జెన్కో ఆడిటోరియం లో ఘనంగా “ఇంజనీర్స్ డే” వేడుకలు
ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

ముఖ్యమంత్రి,కెసిఆర్ నాయకత్వంలో విశ్వేశ్వరయ్య స్ఫూర్తితోనే విద్యుత్ రంగంలో అద్భుతాలు సాధించామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం హైదరాబాద్ లోని ఎర్రగడ్డ టీఎస్ జెన్కో ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 56వ ఇంజనీర్స్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశ నిర్మాణంలో అద్భుతమైన పాత్ర పోషించిన ఇంజనీర్ మొక్షగుండం విశ్వేశ్వరయ్య అన్నారు.

దేశ ఆర్థికవనరులు ఇక్కడి ప్రజలకే ఉపయోగపడాలని ఆయనపడిన తపన కృషి ఎనలేనిది అన్నారు.ప్రతి ఇంజనీర్ విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి అన్న మంత్రి రాష్ట్ర అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. నాయకునికి దార్శనికత పరిపాలనదక్షిత ,ప్రజలపై ప్రేమ ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి తెలంగాణ రాష్ట్రమే నిదర్శనం అన్నారు. విద్యుత్ రంగంలో సాధించిన విజయానికి ముక్యమంత్రి కెసిఆర్ గారి దార్శనికతే కారణం అన్నారు.

తలసరి విద్యుత్ వినియోగం,ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉండటానికి కారణం కేసీఅర్ విజన్ నే కారణం అన్నారు.. ప్రపంచ దేశాలు సైతం అవాక్కయ్యేలా నిర్మించిన కాళేశ్వరరం ప్రాజెక్ట్ కేసీఆర్ గారి ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం అన్నారు. అనంతరం విధుల్లో ప్రతిభ కనబర్చిన ఇంజినీర్లకు జ్ఞాపికలు మంత్రి అందచేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ సిఎండి గోపాలరావు,టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ చైర్మన్, ఎండీ రఘురామరెడ్డి, విద్యుత్ రంగ సంస్థలకు చెందిన డైరెక్టర్ లు,తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్ రావు, ప్రధాన కార్యదర్శి సదానందం తదితరులు పాల్గొన్నారు.