బీఆర్ఎస్ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పు ను ఎదుర్కోలేక భౌతిక దాడులు,హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటని సీఎం అన్నారు.
ఎన్నికల సమయం లో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు బిఆర్ఎస్ నేతలకు కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై ఎవరు దాడులకు పాల్పడ్డా సహించేది లేదని సీఎం అన్నారు.
నియోజకవర్గాల పర్యటనలో ఉన్న సీఎం దుర్ఘటన పై మంత్రి హరీశ్ రావు ను సీఎం ఫోన్లో ఆరా తీశారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.