-ప్రాజెక్టు ను ఎందుకు గోప్యంగా ఉంచారు?
-ఆఫ్ లైన్ టెండర్లు ఎందుకు పెట్టారు?
-కోట్ల రూపాయల దందా
-పొన్నం ప్రభాకర్ మరో కుంభకోణం
-స్కాంలతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోతుంది
-లిక్కర్ నుండి మొదలు బియ్యం స్కామ్ వరకు అన్ని స్కాంలే
-కాంగ్రెస్ స్కాం లపై బి ఆర్ ఎస్ నేత క్రిశాంక్
మంత్రి పొన్నం ప్రభాకర్ మరో కుంభకోణం చేశారు. ఆర్టీసి లో ఒక పెద్ద టెండర్ గోప్యంగా ఉంచి పెద్ద స్కాం చేశారు..లో లోపల ఈ స్కాం జరిగింది. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు వెబ్ సైట్ లో ఎందుకు లేదు? 2023 ఫిబ్రవరి లో గత ప్రభుత్వం పెట్టిన టెండర్లను ఎందుకు రద్దు చేశారు? 11 జనవరి 2024 లో ఆర్టీసి వెబ్ సైట్ లో ఆన్లైన్ టెండర్లను అఫ్ లైన్ ఎందుకు చేశారు?
ఫిజికల్ గా బస్ భవన్ లో టెండర్లు సబ్మిట్ చేస్తే ఎన్ని టెండర్లు వచ్చాయి? ఎవరు ఎంత కోట్ చేశారు? అనే విషయాలు ఎందుకు బయట పెట్టడం లేదు? నెల రోజుల్లోనే హుటాహుటిన 14 అమాండ్ మెంట్స్ తీసుకురావడం లో మతలబు ఏంటి?
ఛలో మొబిలిటీ అనే కంపెనీకి 13 వేల 200 టికెట్ మెషీన్ల కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు? ప్రతి రోజు 30 లక్షల టిక్కెట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యు అయితే ప్రతి టిక్కెట్ కమిషన్ నేరుగా ఆ సంస్థకు వెళ్తుంది. ఆర్టీసీ లెక్కల ప్రకారం ప్రతి రోజు 52 లక్షల టిక్కెట్లు అమ్మితే, 365 రోజులు 5 సంవత్సరాలు అంటే కోట్ల రూపాయల దందా జరుగుతుంది ఇలా ఇంత పెద్ద ప్రాజెక్టు ను ఎందుకు గోప్యంగా ఉంచారు? మా ఆరోపణలు మా డాక్యుమెంట్స్ పై ఆర్టీసీ సమాధానం చెప్పాలి.
ఛలో మొబిలిటీకి ఏ లెక్కన కాంట్రాక్ట్ ఇచ్చారు? ఎన్ని కంపెనీలు టెండర్ లో పాల్గొన్నాయి వాటి వివరాలు ఏంటి అన్ని లెక్కలు చెప్పాలి. ఆన్ లైన్ టెండర్లు తీసేసి ఆఫ్ లైన్ టెండర్లు ఎందుకు పెట్టారు? ఎవరికి లాభం చెయ్యడానికి అమాండ్ మెంట్స్ తెచ్చారు. కంపెనీకి లాభం చేయడానికా ? మంత్రి కి లాభం చేయడానికా ? చెప్పాలి.