కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యే నాగేందర్

– ఒకేరోజు బీఆర్‌ఎస్‌కు రెండు షాకులు
– సీఎం రేవంత్‌తో భేటీ

ఒకేరోజు బీఆర్‌ఎస్‌కు రెండు షాకులు. ఒకటి కేసీఆర్ కూతురు కవిత అరెస్టు కాగా.. రెండవది ఆ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్‌ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరడం. ఎన్నికల ముందు ఈ పరిణామాలు కారును కలవవపరుస్తున్నాయి. ఆయన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.

కాగా నాగేందర్ కొద్దిరోజుల నుంచి కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వచ్చిన కథనాలను నాగేందర్ ఖండించారు. కాగా హైదరాబాద్‌లో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి నాగేందర్ వంటి నేత చేరటంతో కాంగ్రెస్‌లో హర్షం వ్యక్తమవుతోంది.

ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దానం భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీపా దాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. దానం నాగేందర్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

Leave a Reply