కవిత విచారణకు సహకరించాలి

– బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

ఈడీ విచారణకు కవిత సహకరించాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిసూచించారు. ఇన్నాళ్లు విచారణకు సహకరించకుండా కవిత తప్పించుకుని తిరిగారని అన్నారు. సహకరించలేదు కాబట్టే.. ఈడీనే ఆమె ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసిందని తెలిపారు. కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. విచారణ సంస్థలు తమ పని తాము చేసుకుని పోతాయని కిషన్‌రెడ్డి అన్నారు.

కవితపై కక్ష సాధింపు అవసరం లేదు: ఈటల

కవితపై కక్ష సాధింపులకు దిగాల్సిన అవసరం బీజేపీ కి లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈడీ విచారణకు ఆమె సహకరించాలని కోరారు. ఈడీ అధికారులు వారి పని వారు చేసుకుని పోతారని చెప్పారు. దేశంలో విచారణలు మెదటసారి జరగటం‌ లేదన్నారు. ఈడీ దగ్గరున్న ఆధారాలను బట్టి విచారణలు జరుపుతారని ఈటల రాజేందర్ అన్నారు.

Leave a Reply