‘ప్రజాగళం’ సభకు జనం పోటెత్తాలి

– ‘ప్రజాగళం’ సభకు భారీ జనసమీకరణ
– తెలుగుదేశం కార్యాలయంలో బొప్పూడి సభ ఆహ్వాన కమిటీ సభ్యుల సమావేశం

ఈ నెల 17న జరగబోయే చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి ప్రజాగళం సభకు లక్షాలది మందిని సమీకరించేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీల నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు మంగళగిరిలోని తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో బొప్పూడి సభ ఆహ్వాన కమిటీ సభ్యులు సమావేశమయ్యారు.

చిలకలూరిపేటలో జరుగనున్న ప్రజాగళం భారీ భహిరంగ సభకు మూడు పార్టీలు నుంచి భారీ ఎత్తున పాల్గొనాలి అని పిలుపు ఇచ్చారు. శాసనసభ నియోజకవర్గాలు వారిగా ఈ సభ విజయవంతం కొరకు విస్తృత ప్రచారం చేసి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనే విధంగా అందరూ కలిసి కృషి చేయాలని తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు నుంచి భారీగా జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. అందుకోసం నియోజకవర్గాలు వారీగా ఆ పార్టీ నాయకులని బాధ్యులుగా చేసి అవసరమైన ప్రచార సామగ్రి, వాహనాలు సమకూర్చుకునేందుకు, సమాయత్తం చేసేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చెయ్యటం జరుగుతుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొనే ఈ ప్రజాగళం బహిరంగ సభకు ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని, ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి దుష్ట దురహంకార పాలనను అంతమొందించాలని ఆహ్వాన కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.

Leave a Reply