Suryaa.co.in

Andhra Pradesh

బుడమేరు ఒకటో గండి పూడ్చివేత

– పనులు పరిశీలించిన మంత్రులు లోకేష్, నిమ్మల

విజయవాడ: బుడమేరు ఒకటో గండిని అధికారులు విజయవంతంగా పూడ్చివేశారు. ఈ పనులను మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు బుధవారం పరిశీలించారు. మొత్తం ఎన్ని గండ్లు పడ్డాయి? వాటి తీవ్రత.. ఎప్పటిలోగా గండ్లు పూడ్చగలం? అని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు మంత్రులు. గత ఐదేళ్లలో కనీస మరమ్మతుల పనులు కూడా చేయకపోవడమే గండ్లు పడడానికి ప్రధాన కారణమని అధికారులు మంత్రులకు వివరించారు. మరింత వేగవంతంగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యల పై అధికారులతో మంత్రులు చర్చించారు.

సమాంతరంగా అన్ని గండ్లు ఉన్న చోట్లా పనులు నిర్వహించాలని అందుకు అవసరమైన మార్గాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని నారా లోకేష్ ఆదేశించారు. అవసరమైన యంత్రాలు, సామగ్రిని యుద్ధప్రాతిపదికన తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. గంట గంటకు తాను నేరుగా సమీక్ష చేస్తానని ప్రతి గంటకు ఎంత పని జరిగిందో తనకు నివేదించాలని అధికారులను లోకేష్ కోరారు. డ్రోన్ ద్వారా జరుగుతున్న పనులను ప్రతి గంటకు పర్యవేక్షిస్తానని అధికారులకు చెప్పారు. మంత్రి రామానాయుడు గండ్లు పూడ్చి పెట్టే పనులు పూర్తి అయ్యే వరకూ క్షేత్ర స్థాయిలో ఉండి పర్యవేక్షించనున్నారు.

LEAVE A RESPONSE