– స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు
– పోచారం ఎమ్మెల్యే పదవి పోయే వరకు న్యాయపోరాటం
– అన్ని హామీలూ నెరవేర్చలేమని నేరుగా చెప్పండి
– పాలన చేతకాని కాంగ్రెస్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
– భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఎర్రవల్లి: సుప్రీంకోర్టు తెలంగాణలో జరిగిన ఫిరాయింపులపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడలో ఓడిపోవడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని, పోచారం ఎమ్మెల్యే పదవి పోయే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కేవలం 21 నెలల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై దృష్టి పెట్టకుండా, కేసీఆర్ పేరును పదే పదే ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు.
గత ప్రభుత్వం రూ. 2.80 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 21 నెలల్లోనే రూ. 2.20 లక్షల కోట్ల కంటే ఎక్కువ అప్పు చేసిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పుతో ఒక్క సంక్షేమ పథకం లేదా అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని కేటీఆర్ విమర్శించారు.
యూరియా సంక్షోభం వెనుక కుట్ర ఉందని, పంటల కొనుగోళ్లు, బోనస్‌లు ఎగవేయడానికే ప్రభుత్వం కావాలనే యూరియా సరఫరా చేయడం లేదని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో బాన్స్వాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, వందలాది కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ చేతిలో పెట్టామని కానీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలోనూ, గతంలో ఉన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలోనూ ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తమకు పరిపాలన చేతకావడం లేదని, అన్ని కార్యక్రమాలను అమలు చేయలేమని నేరుగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ 21 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 2.20 లక్షల కోట్ల పైగా అప్పులు చేసిందని, ఆ అప్పుతో ఏ ఒక్క సంక్షేమ పథకం లేదా అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని విమర్శించారు. గత ప్రభుత్వం సంవత్సరానికి రూ. 20 వేల కోట్ల అప్పు చేస్తే, ఈ ప్రభుత్వం నెలకు రూ. 20 వేల కోట్ల అప్పు చేస్తోందని ఆరోపించారు.
యూరియా సంక్షోభంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు దారితీస్తోందని కేటీఆర్ అన్నారు. పంటల కొనుగోళ్లకు, ఆ తర్వాత వాటికి ఇవ్వాల్సిన బోనస్‌ను ఎగగొట్టాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే యూరియా సరఫరా చేయడం లేదని ప్రజలు భావిస్తున్నారని ఆయన తెలిపారు. వ్యవసాయ రంగం, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత దుర్మార్గమైన ఆలోచన ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఫిరాయింపులపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్పీకర్ లేదా ఫిరాయింపుదారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాబోయే ఆరు నెలల కాలంలో ఉప ఎన్నికలు వస్తాయని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని కేటీఆర్ హెచ్చరించారు. పోచారం ఎమ్మెల్యే పదవి కూడా పోయే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దయనీయమైన స్థితిలో ఉన్నారని, కానీ బీఆర్ఎస్లో ఉన్న ప్రతి కార్యకర్త గర్వంగా తెలంగాణ తెచ్చిన పార్టీలో ఉన్నామని చెప్పుకోవచ్చని కేటీఆర్ అన్నారు.
పార్టీలో చేరికల కార్యక్రమం
ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో జరిగిన చేరికల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, వందలాది కార్యకర్తలు భారత రాష్ట్ర సమితిలో చేరారు. వీరిలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కోటగిరి వల్లేపల్లి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ బాన్సువాడ నార్ల రత్న కుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బొట్టె గజేందర్, మాజీ సర్పంచులు పద్మ మొగులయ్య, బంజా గంగారాం, కురలేపు నగేష్, మాజీ కో-ఆప్షన్ హకీమ్ తదితరులు ఉన్నారు.