మే నాటికి మన బస్తి మన బడి పనులు పూర్తి

– మంత్రి తలసాని

మే నాటికి మన బస్తి మన బడి పనులను పూర్తి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం నారాయణగూడ లోని కేశవ్ మెమోరియల్ లో మన బస్తి మన బడి కార్యక్రమం క్రింద మొదటి విడతలో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ విప్ MS ప్రభాకర్ రావు, MLC సురభి వాణిదేవి, MLA లు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ దేవసేన, జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, విద్యాశాఖ, GHMC, TSMIDC, TSEWIDC, TSCRIC తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించడం ద్వారా విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన జరగాలనేది ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యం అని వివరించారు. ఆ ఆలోచనలో నుండి పుట్టిందే మన బస్తి మన బడి కార్యక్రమం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అమలు కోసం రాష్ట్రంలో 26,065 పాఠశాలల్లో అభివృద్ధి పనులకోసం 7,289 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఇందులో మొదటి విడతలో 35 శాతం గా 9,123 పాఠశాలలల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించి ఇందుకు గాను 3,497 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమం క్రింద ఆయా పాఠశాలల్లో ప్రహరీగోడ నిర్మాణం, భవనాలకు పెయింటింగ్, విద్యుత్ సౌకర్యం, త్రాగునీటి సరఫరా, టాయిలెట్స్ నిర్మాణం, ఫర్నిచర్ ఏర్పాటు, గ్రీన్ చాక్ బోర్డ్ ఏర్పాటు వంటి పనులను చేపడుతున్నట్లు వివరించారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 239 పాఠశాలల ను అభివృద్ధి పనులను చేపట్టేందుకు గుర్తించి 44 కోట్ల రూపాయలను కేతాయిన్సినట్లు తెలిపారు. వీటిలో వివిధ కారణాలతో 198 పాఠశాలల్లో మాత్రమే పనులను చేపట్టినట్లు వివరించారు. ఈ పనులను కూడా ప్రభుత్వరంగ సంస్థలైన GHMC, TSMIDC, TWEWIDC, TSCRIC ల ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతి పై ఆయా సంస్థల వారిగా మంత్రి సమీక్షించారు. విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకొంటూ పనులను మరింత వేగవంతం చేసి మే నాటికి పూర్తి చేసే విధంగా కార్యాచరణ ను రూపొందించుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Leave a Reply