– మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి
అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం 29 వ ఇ-క్యాబినెట్ సమావేశం జరిగింది. పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.
ఆయుష్మాన్ భారత్ వైద్య సేవ పథకం కింద హైబ్రిడ్ మోడ్‌లో యూనివర్సల్ హెల్త్ పాలసీ రూపకల్పనకు బీమా కంపెనీల నుండి టెండర్లను పిలవడానికి తయారు చేసిన ఆఎఫ్పీ ఆమోదం కొరకు ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం కింద ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలలో 10 కొత్త వైద్య కళాశాలలలను అభివృద్ధి చేయడం పీపీపీ పద్ధతిలో ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందులలో నాలుగు వైద్య కళాశాలల అభివృద్ధి కోసం ముసాయిదా ఆర్ఎఫ్పీలు, రాయితీ ఒప్పందాలకు ఆమోదం, మిగిలిన ఆరు వైద్య కళాశాలల సాధ్యాసాధ్యాల నివేదిక, ముసాయిదా ఆర్ఎఫ్పీ రాయితీ ఒప్పందాలను ఖరారు చేసిన వెంటనే ప్రీ-బిడ్ సంప్రదింపుల ఆధారంగా RFPలో చిన్న మార్పులు చేయడానికి టెండర్ కమిటీని అనుమతించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానం నెం. 546/2025, తే.02.06.2025 ద్వారా ఆమోదించిన విధంగా 2025 జనవరి 1న లేదా ఆ తర్వాత రాజధాని నగరం అమరావతిలో భూమిని కేటాయించిన విద్యా, ఆరోగ్య సంరక్షణ సంస్థలకు అమ్మకం/లీజు మరియు లీజు/అమ్మకం డీడ్ల ఒప్పందాలను అమలు చేసేటప్పుడు రీయింబర్స్మెంట్ ప్రాతిపదికన స్టాంప్ డ్యూటీ చెల్లింపు నుండి మినహాయింపు ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయం వల్లం మంచి పేరున్న విద్యా, వైద్య సంస్థలు ఈ అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రంలో అనధికారికంగా నిర్మించిన భవనాలు, మంజూరైన ప్రణాళికను ఉల్లంఘించి నిర్మించిన భవనాల నియంత్రణ, జరిమానా విధించడానికి కొత్త పథకం రూపకల్పనకు, మునిసిపల్ కార్పొరేషన్స్ చట్టం, 1955, ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీలు చట్టం, 1965, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం, 2014 మరియు ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు చట్టం, 2016 లను సవరించి డ్రాఫ్ట్ ఆర్డినెన్స్‌కు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ల పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి సమావేశ చేసిన సిఫార్సులను ఆమోదించదానికి పరిశ్రమలు మరియు వాణిజ్య (ఫుడ్ ప్రాసెసింగ్) శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి, అవసరమైన భూముల కేటాయింపును సక్రమంగా ఆమోదించడానికి, సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్, రోడ్డు, పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్పుట్ల నిబంధనలకు సౌకర్యాలను కల్పించడానికి మెస్సర్స్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనపై ఎస్ఐపీబీ సమావేశ సిఫార్సులను ఆమోదించడానికి పరిశ్రమలు, వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
పారిశ్రామిక అభివృద్ధి విధానం ఎర్లీ బర్డ్ స్కీమ్ నిబంధనల కింద బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్, అదాని విల్మార్ లిమిటెడ్, టైరోమర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, రామ్షీ బయో ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సర్వరాయ షుగర్స్ లిమిటెడ్, పట్టాభి అగ్రో ఫుడ్స్ లకు ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఎస్ఐపీబీ చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి, అవసరమైన భూముల కేటాయింపును సక్రమంగా ఆమోదించడానికి, సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్, రోడ్డు, పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్పుట్ల నిబంధనలకు సౌకర్యాలను కల్పించడానికి పీపీపీ పార్క్ పాలసీ కింద ప్రైవేట్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధికోసం సమావేశంలో వరహా ఆక్వా ఫార్మ్స్ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా, జె కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ల ప్రతిపాదనలకు చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి, అవసరమైన భూముల కేటాయింపును సక్రమంగా ఆమోదించడానికి, సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్, రోడ్డు, పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్పుట్ల నిబంధనలకు సౌకర్యాలను కల్పించడానికిPPP పార్క్ పాలసీ కింద ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధికోసం M/s IFFCO KISAN SEZ లిమిటెడ్ ప్రతిపాదనకు సంబంధించి ఇటీవల జరిగిన SIPB సమావేశంలో చేసిన సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రూ.870 కోట్లు పెట్టు బడులతో ఏర్పాటు చేసే ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.
రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి, అవసరమైన భూముల కేటాయింపును సక్రమంగా ఆమోదించడానికి, సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్, రోడ్డు, పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్పుట్ల నిబంధనలకు సౌకర్యాలను కల్పించడానికిఇటీవలి SIPB సమావేశంలో M/s HFCL లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అనంతపురం జిల్లా మడకసిరలో రూ.1197 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ కంపెనీ ద్వారా 870 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి.
మంత్రాలయంలో శ్రీ వెంకటేశ్వర లాడ్జ్ (మంత్రాలయం) ప్రైవేట్ లిమిటెడ్‌కు 3-స్టార్ హోటల్ (హిల్టన్-గార్డెన్ ఇన్ బ్రాండ్) అభివృద్ధికై ప్రోత్సాహకాలు అందించేందుకు SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
అమరావతిలో M/s మంజీర హాస్పిటాలిటీ (అమరావతి) ప్రైవేట్ లిమిటెడ్‌కు 4-స్టార్ హోటల్ (హాలిడే ఇన్ బ్రాండ్) అభివృద్ధికై ప్రోత్సాహకాలు అందించేందుకు SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే మరికొన్ని నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.