Suryaa.co.in

Andhra Pradesh

నిమ్మల సమాధానం చెబుతారా?

గాలేరు – నగరి సుజల స్రవంతి(జి.ఎన్.ఎస్.ఎస్)- హంద్రీ – నీవా సుజల స్రవంతి (హెచ్.ఎన్.ఎస్.ఎస్) ప్రాజెక్టుల అనుసంధాన పథకం ఒక అక్రమ ప్రాజెక్టు కాదా! దాని ద్వారా జగన్ – పెద్దిరెడ్డిగార్లు అక్రమార్జనకు పాల్పడ్డారా? లేదా? ఈ పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించిందా? లేదా? నాడు చంద్రబాబునాయుడుపై అంగళ్ళ వద్ద రాళ్ళ దాడి ఎందుకు జరిగింది?

గాలేరు నగరి – హంద్రీ నీవా ప్రాజెక్టుల అనుసంధాన పథకంగా చెప్పబడే ఒక అక్రమ పథకంపై కూటమి ప్రభుత్వానికి ఉన్న మక్కువ ఎన్టీఆర్ మానస పుత్రిక గాలేరు – నగరి సుజల స్రవంతి, 225000 ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టు ఉన్న రెండవ దశ నిర్మాణంపై ఎందుకు లేదు? దాన్ని ఎందుకు అటకెక్కించారు? దాన్ని సత్వరం నిర్మిస్తామని రాజంపేట ఎన్నికల సభలో చంద్రబాబునాయుడుగారు వాగ్దానం చేశారా? లేదా?

పై ప్రశ్నలకు రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.

– టి.లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

LEAVE A RESPONSE