Suryaa.co.in

Political News

కేసులు మీద కేసులు

అమరావతిలో పర్యావరణ అనుకూల రాజధానిని నిర్మించాలన్న తపనకు తోడు, ఎన్టీ విధించిన అతి కఠిన షరతులకు లోబడి నిర్మాణం చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయినా పర్యావరణం పేరుతో అమరావతిని అడ్డుకోవడానికి ప్రయత్నాలు ఆగలేదు. రాజకీయ కారణాలతో కొంతమంది ఈ ప్రాజెక్టును అడ్డుకుంటే, మరికొంత మంది దారితప్పిన ఆదర్శాలతో (misplaced idealism) ముందుకు సాగనివ్వలేదు.

ngtదాదాపు రెండేళ్లకు పైగా విచారణ తర్వాత అమరావతి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వీరు ఆగలేదు. మళ్లీ ఒక నెలరోజుల్లోనే – 2017 డిసెంబరులో ఈఏఎస్ శర్మ రివ్యూ పిటిషన్ వేశారు. దాన్ని ఎన్డీటి తిరస్కరించింది. ఆ వెంటనే ఎస్టీల్ తీర్పు మీద ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2019 జనవరి 4న సుప్రీం కోర్టు అప్పీలును కొట్టివేసింది. ” ఇటువంటి కేసులను ఇండియాలో మాత్రమే దాఖలు చేస్తారని. జస్టిస్ ఎకె సిక్రి, జస్టిస్ అబ్దుల్ నజీర్ లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

bolisetty-satyanarayanaఎన్డీటి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు ఇచ్చిన తర్వాత, ఈ తీర్పును ఎండగడుతూ త ఇతరులు ఆంధ్రప్రదేశ్లో అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. విశాఖలో ఆంధ్రా యూనివర్శిటీ సెంటర్ ఫర్ విమెన్స్ స్టడీస్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్లో స్ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ పాల్గొని ప్రభుత్వం ఎన్డీటికి అన్నీ అబద్ధాలు చెప్పిందని.ఆరోపించారు.

” ఆ సమయంలో అమరావతి మీద బురద చల్లడానికి జన చైతన్య వేదిక పేరుతో ఉన్న సంఘాన్ని నడిపే వి లక్ష్మణరెడ్డి ఇతోధికంగా కృషి చేశారు. ఈ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పలు అమరావతి వ్యతిరేక సభల్లో ఉండవల్లి అరుణ్ కుమార్, ఐవైఆర్ కృష్ణారావు, ఈఎఎస్ శర్మ, జస్టిస్ పి లక్ష్మణరెడ్డి,amaravatiఅజేయ కల్లం, వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు పాల్గొనేవారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డాక మద్యపాన నిషేధ కమిటి చైర్మన్ గా వి లక్మణరెడ్డి నియమితులయ్యారు. క్యాబినెట్ ర్యాంకు కలిగిన ముఖ్య సలహాదారు పదవి అజేయ కల్లంకి దక్కింది.

– ట్రూ

LEAVE A RESPONSE