• సిటు ఇప్పించి ఆదుకోవాలని పేద విద్యార్థిని ఆవేదన
• కోల్డ్ స్టోరేజీలో అగ్నికి పసుపు బస్తాలు ఆహుతి
• పరిహారం ఇప్పించాలని అభ్యర్థించిన రైతు
• అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి
మంగళగిరి: నరసరావుపేట మండలం ఎలమంద గ్రామానికి చెందిన వై.మహేశ్వరి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తాను బేడ బుడగ జంగం కులానికి చెందినదాననని.. తాను పదో తరగతిలో 582 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీలో సీటుకోసం దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. అయితే కుల సర్టిఫికేట్ లేని కారణంగా.. తనకు సీటు ఇవ్వడానికి కాలేజీ వారు నిరాకరిస్తున్నారని.. దయ చేసి తనకు సీటు ఇప్పించాలని బుధవారం ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి అర్జీ ఇచ్చి విద్యార్థిని అభ్యర్థించారు.
• అనంతపురం జిల్లా, రాప్తాడు మండలానికి చెందిన అనిక్ కుమార్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..ఆర్ డబ్ల్యూఎస్ స్కీమ్ కింద బుక్కరాయసముద్రం 2వ పంపు హౌస్ లో ట్యాంక్ మిషన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నామని.. తమకు కొన్ని నెలల నుండి జీతాలు రాక ఇబ్బంది పడుతున్నామని.. దయ చేసి కాంట్రాక్టర్ కు చెప్పి తర్వగా జీతాలు ఇప్పించాలని వేడుకున్నారు.
• 2008- 2009 లలో జిందాల్ కంపెనీ కోసమన బొడ్డవర, కిల్తంపాలెం, ముసిడి పల్లి, ఖండేపల్లి పంచాయతీలలో దాదాపు 1,124 ఎకరాలు భూములను రైతుల నుండి తీసుకున్నారని.. అయితే ఇప్పటివరకు కంపెనీ పెట్టలేదని.. కంపెనీకోసం భూములు ఇచ్చిన ఐదేళ్లలోపు కంపెనీ పెట్టకుంటే చట్ట ప్రకారం ఆ భూములు రైతులకు తిరిగి ఇవ్వాలని… జిందాల్ కంపెనీ తీసుకున్న భూములపై తిరిగి తమకు హక్కులు కల్పించాలని ఆయా గ్రామాలనుండి వచ్చిన రైతులు నేడు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.
• విజయనగరం జిల్లా, మెరకముడిదం మండలం కొర్లం గ్రామానికి చెందిన తాతారావు, అప్పల స్వాములు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ భూములను మజ్జి లక్ష్మణరావు, మజ్జి నారాయణరావు లు ఆక్రమించుకున్నారని.. వారి నుండి తమ భూములు విడిపించాలని కోరారు.
• హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద రూ. 6 లక్షలకుపైగా డబ్బులు తీసుకొని చక్రాయపేట మండలం కుప్పగుంటపల్లికి చెందిన గొద్దెలగల శ్రీనివాసులు అనే వ్యక్తి తనను మోసం చేశారని అతనిపై చర్యలు తీసుకొని డబ్బులు ఇప్పించాలని అన్నమయ్య జిల్లా పుల్లంపేటకు చెందిన సంకీర్తన అభ్యర్థించారు.
• 2024 జనవరి 19న గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం దుగ్గిరాలలోని శుభమ్ మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో అగ్ని ప్రమాదం జరిగి సుమారు లక్ష పసుపు బస్తాలు అగ్నికి ఆహుతి అయ్యి రైతులు నష్టపోయారని.. వాటికి సంబంధించిన పరిహారం నేటికి అందలేదని.. దయచేసి త్వరగా పరిహారం వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు