బీజేపీ మేనిఫెస్టో విడుదల

‘సంకల్ప పత్రం’ పేరిట ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో-2024 ను ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. పేదలు, యువత, రైతులు, మహిళల అభివృద్ధి ‘గ్యాన్’ లక్ష్యంగా (GYAN – గరీబ్, యూత్, ఫార్మర్స్, ఉమెన్స్) ఈ మేనిఫెస్టోని రూపొందించారు. వేదికపై అంబేద్కర్, రాజ్యాంగాల ప్రతిమలను ఉంచి మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ…

Read More

వివాదంలో వారణాసి పోలీసుల డ్రెస్‌ కోడ్‌

వారణాసి లోని కాశీ విశ్వనాథ ఆలయంలో అర్చకుల వేషధారణలో పోలీసులను నియమిస్తూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదం రేపుతోంది. ఆలయంలో విధులు నిర్వర్తించే పోలీసులకు ప్రభుత్వం ఖాకీ దుస్తుల్లో కాకుండా ధోతీ, కుర్తాతో కూడిన సాంప్రదాయ వస్త్రధారణతో డ్రెస్‌ కోడ్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించి వారణాసి పోలీస్‌ కమిషనర్‌ మోహిత్‌ అగర్వాల్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆలయంలో విధుల్లో ఉన్న పోలీసులు ధోతీ, కుర్తా, మెడలో రుద్రాక్ష మాలతో.. మహిళా పోలీసులు సల్వార్‌ కుర్తా…

Read More

భయపడేది లేదు…నేతల బండారం బయటపెడతా

– తీహార్‌ జైలు అధికారి, జైళ్ల శాఖ మంత్రి బెదిరిస్తున్నారు -స్టేట్‌మెంట్‌ ఇవ్వొద్దు అంటూ వత్తిడి చేస్తున్నారు -అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు -సీఎం కేజ్రీవాల్‌, ఇతర నేతలకు సకల సౌకర్యాలు -లిక్కర్‌ స్కాం నిందితుడు సూకేశ్‌ చంద్ర మరో లేఖ ఢల్లీి: తీహార్‌ జైలు నుంచి లిక్కర్‌ స్కాం నిందితుడు సూకేశ్‌ చంద్ర మరో లేఖ రాశారు. సీఎం కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ జైలులో సకల సదు పాయాలు పొందుతున్నారని, అధికారం దుర్వినియోగానికి పాల్పడి…

Read More

నాగపూర్ లో తెలుగు సంఘం ఉగాది కార్యక్రమాలు

నాగ్‌పూర్‌లోని ఆంధ్రా అసోసియేషన్ ఆవరణలో ఇటీవల తెలుగు సంవత్సరాది వేడుకలను నిర్వహించారు. ప్రారంభంలో, ప్రముఖ పండిట్ కొల్లూరి చంద్రశేఖర శాస్త్రి, ఇతర పూజారితో కలిసి, తదుపరి తెలుగు సంవత్సరానికి సంబంధించిన ‘పంచాంగం’ పఠించారు. ముందుగా సభ్యులు ఎం నాగేశ్వరరావు ఉగాది పండుగ ప్రాముఖ్యతను వివరించారు. తరువాత, సాంస్కృతిక కార్యక్రమం – “కోలాటం”, ఒక ప్రముఖ కళాకారిణి రాధ, సుమారు 20 మంది సహ-కళాకారుల సహకారంతో, హర్ష ఆదేశాల మేరకు, అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమం 2 గంటల…

Read More

పీఎఫ్‌ అకౌంట్‌ డబ్బు ఇక ఆటోమేటిక్‌గా బదిలీ

2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై వారం రోజులు దాటింది. EPFOకి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా EPFO ఖాతా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఉద్యోగాలు మారినప్పుడల్లా మీ ఈపీఎఫ్‌వో బ్యాలెన్స్‌ను దానితో పాటు బదిలీ చేయడానికి మీరు కష్టపడాల్సి ఉంటుంది. చాలా సార్లు ఈపీఎఫ్‌వో బ్యాలెన్స్ నెలల తరబడి బదిలీ కాదు. ఇప్పుడు ఈపీఎఫ్‌వో ఖాతాదారులు ఉద్యోగాలు మారినప్పుడు…

Read More

రామేశ్వరం కేఫ్ పేలుడు సూత్రధారుల అరెస్ట్

– 2020 ఉగ్రవాద ఘటనల్లో పాల్గొన్న అబ్దుల్ మతీన్ తాహా, ముసాబిర్ హుస్సేన్‌ బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహా, బాంబును అమర్చిన ముసాబిర్ హుస్సేన్‌ను కోల్‌కతాలో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎన్ఐఏ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బెంగళూరులో ఐసిస్‌కు సంబంధించిన ఘటనల్లో అబ్దుల్ మతీన్ తాహా ప్రమేయాన్ని గుర్తు చేసుకున్నారు. 2020 ఇద్దరూ ఉగ్రవాద ఘటనల్లో పాల్గొన్నట్లు తెలిసింది….

Read More

మీ వాట్సాప్‌లో ఈ ఫీచర్ వచ్చిందా?

మెటా సంస్థ మరో సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఏఐతో పనిచేసే ‘మెటా ఏఐ’ అనే ప్రత్యేక చాట్‌బోట్‌ను లాంచ్ చేసింది. ఈ ఏఐ చాట్‌బోట్‌తో యూజర్లు సరదాగా చాట్ చేయడం లేదా తమకు నచ్చిన ప్రశ్నలను అడగడం వంటివి చేయొచ్చు. Llama టెక్నాలజీ సాయంతో రూపొందిన ఈ మెటా ఏఐ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉండటంతో.. కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తోంది. మరి మీ వాట్సాప్‌లో ఈ ఫీచర్ వచ్చిందా?

Read More

కవల విజయం

టెన్త్ , ఇంటర్ లో కవలలకు సమాన మార్కులు 600 మార్కులకుగానూ 571 మార్కులు పదో తరగతి ఫలితాల్లోనూ ఈ కవలలిద్దరికీ 625 మార్కులకు 620 సహజంగా కవల పిల్లలు ఒకేలా ఉంటారు. పోలికలు, అలవాట్లు కూడా అలాగే ఉంటాయి. ఇవన్నీ మనం సినిమాల్లో కూడా చూసినవే. కానీ విచిత్రంగా కవల పిల్లలకు, చివరకు పరీక్షల్లోనూ ఒకే మార్కులు రావడం మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా? లేదు కదా? ఇప్పుడు కర్నాటకలో ఆ చిత్ర విచిత్రాన్ని మీరే…

Read More

ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా?

మీలో ఎవరూ దీన్ని నమ్మరు.. ఆయన హర్యానా మాజీ ముఖ్యమంత్రి మోహన్‌లాల్ ఖట్టర్, కొన్ని రోజుల క్రితం రాజీనామా చేశారు. అతను తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసి, తన కొద్దిపాటి వస్తువులతో ఒక చిన్న వసతికి బయలుదేరాడు.అతను ఆరెస్సెస్ లో ఉన్నప్పుడు, అతను తన ఆస్తులు, పొదుపు మొత్తాన్ని విరాళాలకు ఇచ్చాడు. ఇప్పుడు తన వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి వచ్చే పెన్షన్‌తోనే బతుకుతాడు. మాజీ ముఖ్యమంత్రులు & మంత్రులు తమ బంగ్లాల నుండి వాష్‌రూమ్‌ల నుండి…

Read More

సుప్రీంను ఆశ్రయించిన కేజ్రీవాల్

లిక్కర్ పాలసీ స్కాంలో తన అరెస్టు అక్రమమని, నిబంధనల ఉల్లంఘనే అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇవే అంశాలతో ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం విచారించిన కోర్టు.. కేజ్రీవాల్ అరెస్టులో ఎలాంటి అతిక్రమణలు జరగలేదని తేల్చింది. ఆధారాలు ఉన్నాయంటూ ఈడీ చేసిన వాదనతో ఏకీభవించింది. కేజ్రీవాల్ అరెస్టు సక్రమమేనని పేర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ పిటిషన్…

Read More