Home » National

ఇక బస్సు సర్వీసులోకి ఊబర్

ఢిల్లీ, కోల్‌కతాలో కూడా ఇప్పటివరకూ కార్లు, టూ వీలర్ సర్వీసులకే పరిమితమైన ఊబర్ ఇకపై బస్సు సర్వీసులో సైతం అడుగుపెడుతోంది. ఢిల్లీ నుంచి తొలి అడుగు వేయనుంది. కోల్‌కతాలో కూడా ఊబర్ సర్వీసును ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారట. దేశ రాజధాని నగరం ఢిల్లీలో తొలుత ఈ సేవలను ప్రారంభించనుంది. ఢిల్లీ ప్రీమియం బస్‌ స్కీమ్‌ కింద ఇకపై బస్సులను ఊబర్ సంస్థ నడపనుంది. ఈ మేరకు దిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా లైసెన్స్‌ అందుకుంది. ఈ…

Read More

ఇరాన్ అధ్యక్షుడి మృతి ..సంతాపదినం ప్రకటించిన భారత్

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నెల 21న సంతాపదినం పాటించనున్నట్లు ప్రకటించింది. రైసీ గౌరవార్థం ఆ రోజున దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. 1989లో ఇరాన్ తొలి సుప్రీంలీడర్ అయతొల్లా రుహోల్లా ఖొమేనీ మరణించిన సమయంలో భారత్ 3 రోజులు సంతాప దినాలు పాటించింది.

Read More

బ్లూ రెసిడెన్సీ’ వీసాలు జారీ

యూఏఈ నిర్ణయం దేశంలో పదేళ్లు ఉండేందుకు వీలు పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు ‘బ్లూ రెసిడెన్సీ’ పేరిట వీసాలు జారీ చేయాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. తమ దేశంలో పదేళ్లు ఉండేందుకు వీలుగా వీటిని ఇవ్వనుంది. మెరైన్ లైఫ్, పర్యావరణ వ్యవస్థ, గాలి నాణ్యత తదితర రంగాల్లో పనిచేస్తున్నవారు వీటికి అర్హులు. ఈ వీసాల కోసం ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్ వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని సూచించింది

Read More

ఓటు వేసిన భారత క్రికెటర్ అజింక్య రహానే

భారత క్రికెటర్ అజింక్య రహానే, అతని భార్య ముంబైలో 2024 లోక్‌సభ ఎన్నికల 5వ దశ సందర్భంగా సోమవారం ఓటు వేశారు. రహానే తన భార్యతో కలిసి ముంబైలో ఓటు వేసిన తర్వాత వారి సిరా వేళ్లను చూపుతూ ఉన్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘‘మేం మా డ్యూటీ నిర్వర్తించాము.. మరి మీరు?’’ అని రాసి ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Read More

అగ్నివీర్‌ రద్దు

– రాహుల్‌ కీలక వ్యాఖ్యలు తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి.. గతంలో మాదిరిగానే సాయుధ దళాలలో రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి మాత్రమే బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. మిగిలిన సీట్లలో తాము విజయం సాధించనున్నట్లు తెలిపారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని, కాంగ్రెస్‌ దానిని కాపాడేందుకు కృషి చేస్తోందన్నారు.  

Read More

భారత్‌లో ఎయిర్ టాక్సీ సేవలు

2026 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ముంబై, బెంగళూరులో కూడా ప్రారంభించే యోచన ఏవియేషన్ స్టార్టప్ జాబీ ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్ టాక్సీని ప్రారంభించబోతోంది. కంపెనీ 2025 నాటికి దుబాయ్‌లో ఫ్లయింగ్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించనుంది మరోవైపు ఇంట్‌గ్లోబ్ ఏవియేషన్స్, ఆర్చర్ ఏవియేషన్ సంయుక్తంగా దేశంలో ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభిస్తున్నాయి. ఢిల్లీలో ఎయిర్ టాక్సీ సర్వీస్ 2026 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముంబై, బెంగళూరులో కూడా ప్రారంభించే యోచనలో ఉంది.

Read More

తమిళనాడులో రెడ్‌ అలర్ట్‌

తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మంగళవారం మధ్య ఆ రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. కన్యాకుమారి, టెన్‌ కాశీ, కోయంబత్తూరు, తంజావూర్‌, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సేలం, ధర్మపురి, తిరుపూర్‌, నీలగిరి జిల్లాల్లో ఇవాళ, రేపు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Read More

ఆ మొబైల్ ఫోన్లు అన్నీ బ్యాన్

కేంద్రం సంచలన నిర్ణయం మొబైల్ ఫోన్ వాడే అందరికీ అలెర్ట్. టెలికం కంపెనీలకు గవర్నమెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సైబర్ క్రైమ్‌లో పాలు పంచుకున్న 28,200 మొబైల్ ఫోన్లపై నిషేధం విధించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం అమలులోకి ఉంటుంది. అలాగే మొబైల్ సిమ్ కార్డులకు సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డులను రీవెరిఫికేషన్ చేసుకోవాలని సూచించింది. 20 లక్షల మొబైల్ కనెక్షన్లకు రీవెరిఫికేషన్ చేయాలని టెలికాం సంస్థలకు…

Read More

వాట్సాప్ స్టేటస్లో 1 మినిట్ వీడియో

ఐఓఎస్ యూజర్ల కోసం వాట్సాప్ ‘స్టేటస్ అప్‌డేట్స్-1 మినిట్’ ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు 1-30 సెకన్ల వీడియోలు మాత్రమే స్టేటస్ పెట్టుకునేందుకు వీలుండగా, ఇక నుంచి ఒక నిమిషం వరకు నిడివి గల వీడియోలను స్టేటస్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంతమంది బీటా టెస్టర్లకు అందుబాటులో ఉందని, త్వరలోనే మిగతా వారికి అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో వెల్లడించింది.

Read More

ఇస్రోతో తమిళనాడు ప్రభుత్వ ఒప్పందం

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏర్పాటుకానున్న చోట 1,500 ఎకరాల్లో ‘స్పేస్‌ పార్క్‌’ నిర్మాణం కానుంది. ఇందుకోసం ఇస్రోతో తమిళనాడు ప్రభుత్వ నిర్వహణలోని ‘టిడ్కో’ ఒప్పందం కుదుర్చుకుంది. కాగా ప్రస్తుతం భారత్‌లో నెల్లూరు జిల్లా శ్రీహరికోట వద్ద బంగాళాఖాతం తీరంలో మాత్రమే రాకెట్‌ ప్రయోగ కేంద్రం అందుబాటులో ఉంది.

Read More