– బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో ఔదార్యాన్ని చూపుతున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల నివాస భవనాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ విధంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ (CCS) ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ. 2,787 కోట్లను మంజూరు చేసింది. ఇందులో నివాస భవనాల కోసం రూ.1,329 కోట్లు, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనం నిర్మాణానికి రూ.1,458 కోట్లు కేటాయించిడం పై దయాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
“ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో మోడీ – మోడీ మదిలో ఆంధ్రప్రదేశ్ ” ఉందనడానికి ఈ ప్రాజెక్టు లు మంజూరు చేయడమే ప్రత్యేక ఉదాహరణ గా దయాకర్ రెడ్డి పేర్కొన్నారు