– బుక్కపట్నం , ఎనుముల పల్లి చెరువు కట్టపై జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
బుక్క పట్నం: పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులతోపాటు 2 రిజర్వాయర్లను నింపడమే నా కర్తవ్యమని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలోని అన్ని చెరువులను వచ్చే మూడేళ్లలో కృష్ణా జలాలతో నింపుతామన్నారు.
అంతకు ముందుగానే చెరువుల కరకట్లను పటిష్టం చేసే విధంగా సాగునీటి కాలువలను మరమ్మత్తులు చేపట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. బుక్కపట్నం చెరువు కట్టపై రూ.13.43 లక్షలతో ,పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని ఎనుముల పల్లి వద్ద రూ.2.09 లక్షలతో మంజూరైన జంగిల్ క్లియరెన్స్, కాలువ మరమ్మత్తు పనులను శుక్రవారం మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తో కలసి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.