– నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం
జిఎస్టీ,టోల్ టాక్స్ వసూళ్ల పై ఉన్న శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పై కేంద్రానికి లేదని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు.గతంలో తెలుగు జాతి, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడిన రాజకీయ పార్టీలు ఢిల్లీ లోని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లుతున్నాయని ఆవేదన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉందని అన్నారు. సన్ రైజ్ స్టేట్ కోసం పోరాడాలని ప్రజలు కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఆదానితో జరిపిన చర్చలు సారాంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వివరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 25 తీర్మానాలు ప్రవేశపెట్టారు.
సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షులు నేతి మహేశ్వరరావు అధ్యక్షత వహించారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు టి లక్ష్మీ నారాయణ, ఏపి జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు చెవుల కృష్ణఆంజనేయులు,ఏ పి ఫ్రొఫెషనల్ ఫోరమ్ కార్యదర్శి బొప్పన రాజశేఖర్, పావులూరి ఖాజారావు,నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షుడు కనకం శ్రీనివాసరావు పాల్గొన్నారు.