సాఫ్ట్ వేర్ అంటే ఏపీ అనే బ్రాండ్ తెచ్చింది చంద్రబాబు

– నిమ్మల రామానాయుడు, టీడీపీ ఎమ్మెల్యే

చంద్రబాబు సీఎం కాకముందు సాఫ్ట్ వేర్ అంటే పూణే, బెంగళూరు, చెన్నై గుర్తొచ్చేవి. చంద్రబాబు సీఎం అయ్యాక సాఫ్ట్ వేర్ అంటే ఏపీ అనే బ్రాండ్ ను తీసుకొచ్చారు. 1982 ముందు రాజకీయనాయకులంటే ఫ్యాక్షనిస్టులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు అనే నానుడి ఉండేది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పేద, బడుగు, బలహీన వర్గాల వారు కూడా రాజకీయాల్లో విశేషంగా రాణిస్తున్నారు. సంక్షేమ పథకాలను తెచ్చింది ఎన్టీఆర్ అయితే..దాన్ని నిలబెట్టి అభివృద్ధి చేసింది చంద్రబాబు.

మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలను స్థాపించిన ఘనత చంద్రబాబుది. మహిళలకు గ్యాస్ కనెక్షన్లు, విద్యార్థినులకు ఉచిత సైకిళ్లు ప్రవేశపెట్టింది చంద్రబాబు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాకే సంక్షేమం, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ప్రారంభమయ్యాయి. దళితులను స్పీకర్లను చేసిన ఘనత టీడీపీకే దక్కుతుంది. కానీ నేడు జగన్మోహన్ రెడ్డి సైకో పాలనలో దళితులకు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కుంటుపడింది.

ఎస్సీలకు సంబంధించిన 27సంక్షే పథకాలు రద్దు చేశారు. సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి ద్రోహం చేస్తున్నారు. అందేకే సైకో పాలన పోవాలి-సైకిల్ రావాలి అనే నినాదాన్ని రాష్ట్ర ప్రజలు అందిపుచ్చుకోవాలి. శాసనసభను కౌరవసభగా మార్చిన దొంగల ముఠాను బంగాళాఖాతంలో కలపాలి. శాసనసభను గౌరవసభగా నిర్వహించే టీడీపీ పాలనను తీసుకురావాలి.

Leave a Reply