Suryaa.co.in

Andhra Pradesh Telangana

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఎన్టీఆర్ వర్థంతి ఉత్సవాలు

– స్వర్గీయ నందమూరి తారక రామారావు మరియు స్వర్గీయ బసవతారకం విగ్రహాలకు పుష్పాంజలి ఘటించిన నందమూరి బాలకృష్ణ

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 27 వ వర్థంతి సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో నేటి ఉదయం నందమూరి బాలకృష్ణ ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా హాస్పిటల్ ఆవరణలో ఉన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు మరియు స్వర్గీయ నందమూరి బసవతారకం విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. ఆయనతో పాటూ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది విగ్రహాలకు పుష్పాలు సమర్పించి తమ తమ నివాళులు అర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమెరికా నివాసి పాటిబండ్ల రాజీవ్ మరియు ఆషాకుమారి లు హాస్పిటల్ కు లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ చెక్కును నందమూరి బాలకృష్ణ వారింటి చిన్నారి పాటిబండ్ల పూజ సంహిత చేతుల మీదుగా అందుకొని ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు నటలాయం అని అంటూ సామాన్య రైతు కుటుంభంలో పుట్టి సినిమా రంగం మహరాజులా పెరిగారు. పౌరాణికాలు ప్రాణాలు పోసుకుంటే, జానపదాలు జావళిలు పాడాయి అన్న రీతిన ఆయన సినిమారంగంలో రాణించారని, దేశమంతా గాలించినా ఆయనలా నటనలో ప్రయోగాలు చేసిన వ్యక్తి స్వర్గీయ యన్ టి ఆర్ అని కొనియాడారు. తాను సినిమా రంగంలో రాణిస్తూనే పలు సామాజిక కార్యక్రమాలు చెపట్టారని, తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొన్న ఎన్నో సంక్షోభాలలో తన వంతు పాత్ర పోషించారని చెప్పారు.

అంతే గాకుండా తనను అభిమానించే తెలుగు ప్రజలకు ఏదో చేయాలనే కోరికతో స్వర్గీయ యన్ టీ ఆర్ పని చేశారని, ఈ పనిలో ప్రాంతల మధ్యలో భేదాలు చూపకుండా అందరినీ కలుపుకుంటూ పని చేసిన వ్యక్తని బాలకృష్ణ అన్నారు. ప్రతి చోట తాను తెలుగువాడని చెప్పుకొనేలా ఆత్మవిశ్వాసం అందించిన ప్రజానాయకులు ఆయన అని పేర్కొన్నారు. తాను రాజకీయాలకు రావడమే కాకుండా ప్రజలలో రాజకీయాల పట్ల ఛైతన్యం తీసుకొనివచ్చని వ్యక్తి అని, ప్రజలలో కూడా రాజకీయ హీరోగా గుర్తింపు సాధించారని చెప్పారు. అంతే గాకుండా ప్రజలకు అవసరమైన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి అమలు చేయడమే కాకుండా తర్వాతి ప్రభుత్వాలు కూడా వాటిని కొనసాగించే రీతిలో పని చేశారని చెప్పారు.

మా తల్లిగారు క్యాన్సర్ తో భాదపడి మరణించిన పిదప, పేదవారందరికీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్యాన్సర్ వైద్యం అందించాలనే సంకల్పంతో స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆశలకు రూపమే ప్రస్థుతం మనం చూస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి సెంటర్ అని శ్రీ బాలకృష్ణ చెప్పారు. ఈ వైద్యశాల ద్వారా ఎందరో పేదలకు పలు రకాల సహాయం, చికిత్స అందించగలుగుతున్నామని, అదే సమయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులోనికి తీసుకొని వస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా ఈ హాస్పిటల్ దినదినాభివృద్ది సాధించడంలో ఎంతో దాతలు చేస్తున్న సహాయం మరువలేదని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సహకారం, సిబ్బంది నిరంతరాయ శ్రమ ఉన్నాయని చెప్పారు. ఇందుకు నిదర్శనమే హాస్పిటల్ ఇటీవల కాలంలో సాధిస్తున్న అవార్డులు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. అనంతరం హాస్పిటల్ లో ఉన్న ఆరోగ్య శ్రీ వార్డులను సందర్శించిన నందమూరి బాలకృష్ణ అక్కడ చికిత్స పొందుతున్న రోగుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారికి పండ్లు పంపిణీ చేసి, వారితో సెల్ఫీలు మరియు ఫోటోలు దిగి సంతోషపెట్టారు.

ఈ కార్యక్రమాలలో జెయస్ ఆర్ ప్రసాద్, ట్రస్టు బోర్డు సభ్యులు, BIACH&RI; డా. గడ్డం దశరధరామిరెడ్డి, ట్రస్టు బోర్డు సభ్యులు, BIACH&RI; భరత్ మతుకుమిల్లి, ట్రస్టు బోర్డు సభ్యులు, BIACH&RI; డా. ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI; డా. టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI; డా. ఫణికోటేశ్వర రావు, మెడికల్ సూపర్నిటెండెంట్, BIACH&RI; డా. కల్పనా రఘునాద్, ఆసోసియేట్ డైరెక్టర్, అకడమిక్స్ మరియు యాడ్ లైప్, BIACH&RI లతో పాటూ పలువురు వైద్యులు, ఇతర సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE