Suryaa.co.in

Andhra Pradesh

అప్పుల ఆంధ్ర ను చంద్రబాబు అభివృద్ధి వైపు నడిపిస్తున్నాడు

– పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

నల్లమాడ: అప్పుల ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రి గా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.

నియోజకవర్గంలోని నల్లమాడ మండలం వెళ్ళ మద్ది పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ,చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు చేసిన అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారని వెల్లడించారు.

వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. గత ఐదేళ్లలో జగన్ ఒక ఉద్యోగం ఒక పరిశ్రమ ఇచ్చిన దాఖలాలు లేవు అన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ నన్ను తీసుకొచ్చి ఐదు రూపాయలకే కడుపునిండా భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు.

అతి త్వరలో నియోజకవర్గంలోని కొత్తచెరువు ఓడి చెరువు నల్లమాడ అమడుగురు బుక్కపట్నం మండలాల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని తెలిపారు. నల్లమడ మండలానికి ప్రస్తుతం 3 కోట్లతో ఉపాధి హామీ పథకం కింద సిసి రోడ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు మంజూరు చేశామని చెప్పారు.

LEAVE A RESPONSE