– వ్యవసాయ విద్యుత్ సరఫరా పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ
-విద్యుత్ అవసరాలకు రోజూ 30 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు
– వైఎస్ఆర్సిపి ది ఆత్మీయ కుటుంబం-పచ్చ ప్రయత్నాలకు విచ్చిన్నం కాదు
– నూతన మంత్రి వర్గం సామాజిక న్యాయానికి శ్రీకారం
– నూతన మంత్రివర్గంలో అత్యధికులు విద్యాధికులే
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి
ప్రస్తుత కరెంటు సంక్షోభానికి చంద్రబాబే కారకుడని, కమీషన్ల కోసం ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కు అయ్యాడని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. 2014 నుంచి ఏటా 8.5% ఉత్పాదన పెరగాల్సి ఉండగా, ఏపి జెన్ కో ప్లాంట్లలో ఉత్పాదన తగ్గించి ప్రైవేటుకు దోచి పెట్టాడని తెలిపారు .అప్పట్లో హితేన్ భయ్యా కమిటీ సిఫారసులతో డిస్కంలను అమ్మాలని చూసిన చరిత్ర ఈ విజనరీ చంద్రబాబు దేనిని అన్నారు.
వ్యవసాయ విద్యుత్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వ్యవసాయ విద్యుత్ సరఫరాపై ప్రత్యేకంగా పర్యవేక్షించి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ఒక్క ఎకరం పంట పొలం కూడా ఎండకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇంధన శాఖను ఆదేశించిందని అన్నారు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు బహిరంగ మార్కెట్లో నిత్యం 30 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ ను కొనుగోలు చేస్తోందని అన్నారు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగిందని, గృహ వినియోగం 32%, పారిశ్రామిక వినియోగం 6%, వ్యవసాయ వినియోగం 15% పెరిగాయని అన్నారు. మరోవైపు అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భగ్గుముంటున్నాయని ఈ మేరకు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా రోజూ 30 మిలియన్ యూనిట్లు విద్యుత్ బయట కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ నెలాఖరుకు పరిస్థితి చక్కబడే అవకాశం ఉందని అన్నారు.
చంద్రబాబు, పచ్చ కుల మీడియా గడిచిన 4 రోజులుగా మంటలు రేపి, చిచ్చు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారని. అదిగో పొగ, ఇదిగో తిరుగుబాటు అంటూ కాకమ్మ కథలు ప్రచురిస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ ఆత్మీయతలతో నిండిన కుటుంబమని, వారి దిష్టి’కి రాళ్లు పగలొచ్చేమో వైకాపా కుటుంబం మాత్రం విచ్ఛిన్నం కాదని అన్నారు.
బిసి, ఎస్సి, ఎస్టి, మైనార్టీ వర్గాలకు క్యాబినెట్ లో అత్యధిక ప్రాధాన్యత కల్పించి, సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేనని అన్నారు. 2014లో చంద్రబాబు తన క్యాబినెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 42 శాతం పదవులిస్తే 2017లో 40 శాతానికి తగ్గించారని గుర్తుచేశారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ తన క్యాబినెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులిస్తే 2022 పునర్వ్యవస్థీకరణలో ఎకంగా 68 శాతానికి పెంచారని అన్నారు. సిఎం సామాజిక క్యాబినెట్ ను ఆచరణలో చూపించారని అన్నారు.
నూతన మంత్రివర్గంలో విద్యాధికులు అధికశాతం మంది ఉన్నారని, వారిలో ఒకరు డాక్టర్, కాగా, పీహెచ్ డీలు చేసిన వారు ఐదుగురు, ముగ్గురు పోస్ట్ గ్రాడ్యుయేట్లు, బీటెక్ గ్రాడ్యుయేట్లు ఇద్దరు, ఎనిమిది మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారని వీరి సేవలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు.