Suryaa.co.in

Andhra Pradesh

బీసీల తోకలు కత్తిరిస్తానన్న బాబెక్కడ?

-బీసీల రక్షణ కోసం చట్టాలు చేసిన జగన్ ఎక్కడా?
-ఇద్దరు పీకేల మధ్య పాకుతున్న లోకేశ్
-బీసీలను అణగదొక్కడంలో మొదటి ముద్దాయి చంద్రబాబే
-సామాజిక న్యాయానికి చిరునామా ఆంధ్రప్రదేశ్‌
-ఏనాడైనా ఒక్క బీసీని రాజ్యసభకు పంపారా..?
-బీసీలను కేవలం కులవృత్తులకే పరిమితం చేసింది చంద్రబాబే
-బీసీల రిజర్వేషన్లపై కేసులు వేయించి అడ్డుకున్నది చంద్రబాబు కాదా..?
-మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌

బీసీలను అణగదొక్కడంలో మొదటి ముద్దాయి చంద్రబాబే:
– తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిని అని చెప్పుకుంటున్న లోకేశ్‌..ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి కాదు…జాతికి మాత్రమే ప్రధాన కార్యదర్శి అని చెప్పుకోవచ్చు.
– బీసీలకు ఆయన ఒక రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్తున్నాడు.
– చరిత్ర తెలుసుకో…లోకేశ్‌…ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీలకు అట్రాసిటీ చట్టం తెస్తాడట.
– అలాంటి చట్టాన్ని ముందుగా దాన్ని నీ తండ్రి నారా చంద్రబాబునాయుడు పైనే ప్రయోగించాల్సి వస్తుంది.
– ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఎస్సీల చట్టాన్ని అపహాస్యం చేశాడు.
– బీసీలను నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తాను అన్నాడు.
– బీసీలకు రక్షణ చట్టాన్ని మేం ఎప్పుడో తీసుకొచ్చాం. జగన్మోహన్‌రెడ్డి గారు నాయి బ్రాహ్మణులను మంగళి అని పిలిస్తే శిక్షార్హుడవుతాడు.
– అలా నాయీ బ్రాహ్మణులను మాట్లాడిన నీ తండ్రి మొదట శిక్షార్హుడు.
– మత్స్యకారులను తోలు తీస్తాను అన్నాడు. ఇప్పుడు బీసీల రక్షణ చట్టం అంటే ఎవరు నమ్ముతారు.
– బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన మొదటి ముద్దాయి చంద్రబాబు.

మీరు బీసీలను చైతన్యవంతులను చేసేదేంటి..?:
– లోక్‌సభ, శాసనసభల స్థానాల్లో బీసీలకు ప్రత్యేక కేటాయింపులంటూ ఇప్పుడు లోకేశ్‌ మాట్లాడుతున్నాడు.
– 1999లో మీ నాన్న బీసీలకు వంద సీట్లు ఇస్తానన్నాడు. ఎన్నిచ్చాడు..?
– 33.33 శాతం బీసీలకు సీట్లు కేటాయిస్తానన్న టీడీపీ అలా కేటాయించకుండా బీసీలను మోసం చేసిన నీ తండ్రి శిక్షార్హుడా..? కాదా?
– మార్కెట్‌ కమిటీల్లో 33.3 శాతం ఇస్తానన్నాడు..ఇచ్చాడా?
– బీసీలకు చైతన్యం ఉండదని నీ అభిప్రాయమా..? నువ్వు బీసీలను చైతన్యవంతులను చేసేందేంటి? మేమెప్పుడూ చైతన్యవంతులమే.
– మా నాయకుడిని సైకో అంటున్నావు కానీ..నువ్వు సైకోగా మారిపోయావు.
– మా నాయకుడు వైఎస్‌ జగన్‌ గారు 50 శాతం రిజర్వేషన్లను మార్కెట్‌ కమిటీల్లో కల్పించారు.
– 56 బీసీ కార్పొరేషన్లతో పాటు వివిధ కార్పోరేషన్లు, పదవుల్లో బీసీలకు 50 శాతానికి పైగా పదవులిచ్చి వారి ఎదుగుదలకు తోడ్పడిన వ్యక్తి శ్రీ జగన్‌ గారు.
– రాజ్యసభలో నాలుగు స్థానాలను బీసీలకు కేటాయించి సామాజిక న్యాయానికి ఒక చిరునామా ఆంధ్రప్రదేశ్‌ అని చేసి చూపించారు.

బీసీలు చైతన్యవంతులయ్యారు కాబట్టే మీకు 23 సీట్లిచ్చారు:
– మీ పరిపాలనలో ఒక్కరినైనా బీసీలను రాజ్యసభకు పంపారా?
– బీసీలు చైతన్యవంతులు అయ్యారు కాబట్టే నీ పార్టీని సరైన విధంగా బుద్ధి చెప్పారు.
– బీసీలను పక్కన పెట్టి ఏ అర్హత లేని నిన్ను మంత్రిని చేసి మూడు శాఖలు కట్టబెట్టిన మీరా మాట్లాడేది..?
– మళ్లీ ఇప్పుడు వచ్చి మీరు చైతన్యవంతులను చేసేదేంటి?
– మీ దగ్గర ఒకే అరిగిపోయిన రికార్డు ఉంది..16వేల మంది పదవులు తగ్గిపోయాయని మాట్లాడుతున్నారు.
– 2014–19 మధ్యలో అధికారంలో ఉండి ఎన్నికలు నిర్వహించని కారణంగా ఈ దుస్థితి ఏర్పడింది.
– సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయలేమని ఆనాడు కిరణ్‌ కుమార్‌ రెడ్డి అఫడవిట్‌ వేశాడు.

LEAVE A RESPONSE