-రాష్ట్రాన్ని లూటీ చేయడానికి జగన్ అధికారంలోకి వచ్చాడు
-ల్యాండ్ టైటిల్ చట్టం తెచ్చింది భూములు దోచేందుకే
-ప్రజలకు ఇచ్చేది గోరంత..పబ్లిసిటీ కొండంత
-కుప్పం నియోజకవర్గం శాంతిపురం సభలో చంద్రబాబు
శాంతిపురం :- జగన్ లాంటి పాలకుడు రాజకీయాలకు అనర్హుడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని లూటీ చేయడానికి జగన్ అధికారంలోకి వచ్చాడని, ప్రజలకు సేవ చేయడానికి కాదని అన్నారు. ల్యాండ్ టైటిల్ చట్టం తెచ్చింది భూములు దోచేందుకేనని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చేది గోరంత..పబ్లిసిటీ మాత్రం కొండంత అని అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ లో చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రసంగించారు.
‘‘శాంతిపురం నాకు కొత్త కాదు ఎప్పుడూ వస్తూనే ఉంటాను. కానీ మీలో ఈ సారి ప్రత్యేకమైన అభిమానం కనబడుతోంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. నిన్న, నేడు మీ ఉత్సాహం చూశాక మన కుప్పంలో టీడీపీకి లక్ష ఓట్ల మెజార్టీ కష్టం కాదనిపిస్తోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ జండా రెపరెపలాడే నియోజకవర్గాలు రెండున్నాయి…ఒకటి కుప్పం..రెండోది హిందూపురం. హిందూపురం ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం..రెండోది మీ అభిమానంతో నేను చెలిచే కుప్పం నియోజకవర్గం. 7 సార్లు నన్ను గెలిపించారు.. అంతక ముందు కుప్పంలో 2 సార్లు టీడీపీని గెలిపించారు. నేను ఇక్కడ కులం, మతం, చూడకుండా మీ పెద్దకొడుగుగా ఉండాలని పని చేశాను.
ఈ నియోజకవర్గంలో ఎవరికీ దక్కని అభిమానం నాకు దక్కింది. నేను నామినేషన్ వేయడానికి కూడా రావద్దని చెప్పి గెలిపించిన ఏకైక నియోజకవర్గం కుప్పం. మేము గెలిపించుకుంటా..మీరు రాష్ట్రంలో తిరగడి..మళ్లీ సీఎంగా రావాలని కోరుతున్నారు. తెలుగుజాతికి కుప్పం ఒక ప్రయోగశాల. రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా ఆ స్ఫూర్తి నిచ్చే ప్రజానికం ఉంది కుప్పం..నాస్ఫూర్తి ప్రదాతలు మీరే. 25 ఏళ్ల క్రితం ఇజ్రాయిల్ టెక్నాలజీ తీసుకొచ్చాం. మన నియోజకరవర్గానికి మంచి వాతవారణం దేవుడు ఇచ్చారు. బంగారం పండించే రైతులు ఉన్నారు..మంచి భూములు ఉన్నాయి. చేయూత నిస్తే ఏమైనా చేయగలుగుతారని మొదటి ప్రాజెక్టుగా ఇజ్రాయిల్ టెక్నాలజీని ఇక్కడికే తీసుకొచ్చాను.
కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం వల్ల అన్నీ పోయాయి గుండుసున్నా పెట్టింది. తుంపర సేద్యానికి ప్రాధాన్యం ఇచ్చాం..దీంతో అధిక దిగుబడి సాధించే అవకాశం వచ్చింది. కుప్పంలో పండని పంటే లేదు. ఈ ప్రాంతంలో సెరీ కల్చర్ రావాలి…పట్టు పరిశ్రమ కూడా రావాలన్నది నా కల. మొదటి ఎన్నికల సమయంలో కుప్పం ఎలా ఉందో..ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఊర్ల గత చరిత్ర తెలుసుకుంటే పరిస్థితి తెలిసేది. గతంలో కుప్పం-వి.కోట-పలమనేరు రోడ్డు మాత్రమే ఉండేది. ఏ ఊర్లోనూ స్కూళ్లు లేవు..కానీ నేను వచ్చాక నిర్మించాను. మనం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది..కానీ కుప్పం పట్ల ఇప్పుడు సీత కన్ను ప్రదర్శిస్తున్నారు. 2004లో నేను ఓడాక ఇజ్రాయిల్ టెక్నాలజీని మూసేయడంతో గుజరాత్ కు తరలిపోయింది.
టీడీపీ అధికారంలో ఉండుంటే హంద్రీనీవా ద్వారా ప్రతి ఎకరాకు నీళ్ల వచ్చేవి. 2014 కు ముందు హంద్రీనీవాను పట్టించుకోలేదు. ఎన్టీఆర్ ప్రారంభించిన హంద్రీనీవా పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్లాను. వి.కోట దాకా నీళ్లు వచ్చాయి…87 శాతం పనులు పూర్తయ్యాయి…13 శాతం పనులు పూర్తిచేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ వైసీపీ. ఎందుకు కుప్పం అంటే మీకు చిన్నచూపు? కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లు ఇస్తానని చెప్పి నీళ్లు ఇచ్చా…నీకు బాద్యత లేదా జగన్.?
ఎందుకు ఈ నిర్లక్ష్యం ఇది ఎవరి పాపం.? 13శాతం పనులు పూర్తి చేసి ఉండుంటే నీళ్లు వచ్చేవి. పాలార్ లో 35 చెక్ డ్యాములు నిర్మించాము..చెరువులకు నీళ్లు కూడా అందేవి. కుప్పంలో కరువు అనేది లేకుండా చేయాలని చూస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారు…ఏమొచ్చింది మీకు.? ఇక్కడకు ఒక మంత్రి పరుగెత్తుకు వస్తాడు..మన మీద ప్రేమతో కాదు..గ్రానైట్ మీద ప్రేమతో. లెక్కలు తేల్చుకోవడానికి ఇక్కడికి వచ్చి అందరికీ మద్యం తాగించి ఆస్తులు దోచుకోవాడనికి వస్తాడు.
వైసీపీ నేతలకు ప్రజలకు మంచి చేయాలని లేదు. ప్రజల పేరుతో దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఇక్కడికి వచ్చి గతంలో అక్రమ క్వారీలను చూపించాను..అయినా చర్యల్లేవు. ఇసుక మద్య, మైనింగ్, భూములు ఏది వీళ్ల కల్లల్లో పడ్డా అదిమటాష్. ఆవులపల్లి ప్రాజెక్టు పుంగనూరులో ఇది ఉంది. రైతులకు ఆర్ అండ్ ఆర్, భూములకు పరిహారం ఇవ్వాలి. కానీ అలా చేయకుండా రూ.2,002 కోట్లకు టెండర్ పెట్టారు. ఆవులపల్లి, నీటిగుంటపల్లి, ముదివీడుకు అనుమతులు లేవు..అనుమతులు లేకుండా పనులు చేపట్టారు. రైతులను బెదిరించి ఆ ప్రాజెక్టు కడితే రైతులు కోర్టుకు వెళ్లారు. దీంతో గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్లు ఫైన్ వేసింది.
ఒక వ్యక్తి దుర్మార్గానికి, అన్యాయానికి, అరాచకానికి ప్రజాధనం రూ.25 కోట్లు ఫైన్ గా చెల్లించారు. హంద్రీనీవా కింద రూ.5,5500 కోట్ల పనులు పెద్దిరెడ్డికి ఇచ్చారు..వీళ్లు దోపిడీ, గజ దొంగలు.. రూ.15 వందల కోట్లు పనులు చేయకుండా డబ్బులు మార్చుకున్నారు. ఎవర్నీ వదలను మీరు దోచిన డబ్బులు కక్కిస్తా. కుప్పం నియోజకవర్గంలో సాదు గ్రామంలో 35 ఎకరాల డీకేటీ భూమిని వైసీనీ నేతలు కబ్జా చేశారు. వైసీపీ మండల అధ్యక్షుడు బుల్లెట్ దండపాణి అనే వ్యక్తి నల్లగుట్ట దగ్గర 4 ఎకరాల ప్రభుత్వ భూమి కొట్టేశాడు. ఈశ్వర దేవాలయం భూముల్ని కూడా కబ్జా చేశారు. ఎంపీ నిథులతో బస్ షెల్టర్ కడితే భూమికి జాగా కావాలని దాన్ని కూడా కొట్టేశారు.
చిందుబల్ల పంచాయతీలో పొలం దారిని కూడా కబ్జా చేసి షెడ్లు నిర్మించారు. ఏడోమైలులో 6.6 ఎకరాలు ఆక్రమించుకుని షాపింగ్ కాంప్లిక్స్ నిర్మించుకున్నారు. ఏపీఐఐసీకి చెందిన 4 ఎకరాలను వైసీపీ నేతలు కబ్జా చేశారు. పోలిశెట్టిగానిపల్లెలో వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తే ప్రజలే తిరగబడ్డారు. మన నియోజకవర్గం ప్రశాతంమైంది. నేను అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలకు ఇబ్బంది వచ్చిందా? కానీ ఐదేళ్లుగా కుప్పంలో రౌడీ ఇజం, కబ్జాలు పెరిగాయి. యువతను పెడదారి పట్టిస్తున్నారు. 220 కేబీ సబ్ స్టేషన్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్, ఐటీఐ బిల్డింగ్స్, రాళ్లబొదుకూరులో జూనియర్ కాలేజీ, ఏపీ మోడల్ కాలేజీలు, కళ్యాణ మండపాలు లాంటి ఎన్నోరకాల అభివృద్ధి పనులు చేశాం.
రాళ్ల గంగమ్మ గుడికి 5 సెంట్లు ఇస్తే దాన్ని రద్దు చేశారు. గ్రామాలు శుభ్రంగా ఉండాలని చెత్తసేకరణ షెడ్లు కూడా నిర్మించాను. రూ.2లకే 20 లీటర్ల నీళ్లు ఇస్తే వైసీపీ వచ్చాక దాన్ని నాశనం చేశారు. శాంతి పురం – గడ్డూరు నుండి కర్నాటక బార్డర్ దాకా డబుల్ రోడ్డు అడిగారు..వేయిస్తా. శివరామపురం నుండి కొలమడుగు వరకు కూడా డబుల్ రోడ్డు వేస్తాం. రాళ్ల పల్లి నుండి గోవింద పల్లికి కూడా డబుల్ రోడ్డు వేస్తా. ఇప్పుడు రూపొందించే ప్రణాళిక అధికారంలోకి రాగానే అమలు చేస్తాం. శాంతిపురంలోని ఖాళీ భూములను గుర్తించి వాటిల్లో పరిశ్రమలు పెట్టి పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తాను. యువతను చూస్తే నాకు కొండంత ధైర్యం.
ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా.? పరిశ్రమలు వచ్చాయా..డీఎస్సీ నిర్వహించారా? మీకు ఆవేశం, కోపం వస్తే వైసీపీ నేతలు బయటకు కూడా రాలేరు. నాడు నేను మీకు నిరుద్యోగ భృతి ఇచ్చాను..6 లక్షల ఉద్యోగాలు కూడా అందించాను..అది ఈ ప్రభుత్వమే అసెంబ్లీలో స్వయంగా ప్రకటించింది. సీఎంకు ఉద్యోగం కావాలి..మంత్రులకు ఉద్యోగం కావాలి..రాష్ట్రాన్ని దోపిడీ చేయాలి కానీ నా తమ్ముళ్లకు మాత్రం ఉద్యోగాలు రాకూడదా.? మళ్లీ అధికారంలోకి రాగానే రూ.3 వేల నిరుద్యోగ భృతితో పాటు 20 లక్షల ఉద్యోగాలు అందిస్తాం అని చంద్రబాబు అన్నారు.
యువతంతా అంటోంది జాబు రావాలంటే..బాబు రావాలని అడగుతున్నారు. ఈ మండలంలో ఎక్కువ వాణిజ్య పంటలు పండుతాయి. అధికారంలోకి రాగానే హంద్రీనీవా నీళ్లు తీసుకొస్తా..లిఫ్ట్ ద్వారా అన్ని చెరువులకు నీళ్లు అందిస్తా. వాణిజ్య పంటల కోసం మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేస్తాం..మార్కెట్ యార్డ్ పెట్టి ఎగుమతులు పెంచుతాం. అధికారంలోకి రాగానే విమానాశ్రయం నిర్మిస్తాం..మీరు పండించే పంటలు ప్రపంచానికి అందించేలా చేస్తాం.. మళ్లీ రైతురాజ్యం వస్తుంది…రైతే రాజు అవుతాడు. డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాను.
రైతులకు రూ.20 వేల అందిస్తాను. ఈ రోజు నీది..రేపు ప్రజలది పెద్దిరెడ్డి. స్థానికులకే గనులు కేటాయిస్తాం. జనార్థన్ నాయుడు అనే వ్యక్తికి గ్రానైట్ క్వారీ ఉంది. ఆయన్ను బెదిరించి పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ లాగేసుకున్నాడు. ఫ్యాక్టరీ ఎమ్మెల్యేనే నిర్వహించుకుని విద్యుత్ బిల్లు మాత్రం జనార్థన్ ను కట్టమన్నారు. రూ.200 కోట్లు గ్రానైట్ ద్వారా సంపాదించున్నారు. పెద్దిరెడ్డి వేల కోట్లు దోచుకున్నారు. ఆయన ఇంట్లో మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నారు. ధైర్యం ఉంటే వాళ్లను తొలగిస్తావా జగన్..సీటు ఇవ్వకుండా మానేస్తావా.? నీకు కమిషన్ ఇచ్చిన వాళ్లను, వ్యాపార భాగస్వాములను మాత్రం ఏమీ చేయవు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులుగామారి, ప్రజలను దోచుకున్నారంటే దానికి కారణం జగన్.
సాక్షి విలేకరి ఎచ్చర్లలో ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పీఏ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మన కుప్పం నియోజకవర్గంలో 500మందిపై అక్రమ కేసులు పెట్టారు..ఏంటీ దౌర్బాగ్యం.? వైసీపీ వాళ్లను నేను సీఎం అయ్యాక వదిలిపెడతానా.? ఈ పరిస్థితి తెచ్చింది ఎవరు..సైకో కాదా? ఈ రాష్ట్రంలో బతికే హక్కు లేదా..ఏంటీ ఈ నియంత పోకడలు.? 14 ఏళ్లు సీఎంగా ఉన్నాను..ఎంతో మంది సీఎంలను చూశానుకానీ..ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. మరో కొత్త చట్టాన్ని తెచ్చారు..అదే ల్యాండ్ లైటిల్ యాక్ట్. మొన్నే సర్వే చేశారు..దాని రహస్యం మీకు తెలీదు. మీ భూములు మీ పేరు మీదున్నాయో..వైసీపీ నేతల పేర్ల మీద ఉన్నాయో తెలీదు. మీ భూమిని వైసీపీ నేతలు ఈజీగా కొట్టేస్తారు.
వైసీపీ నేతలకు వాటా ఇవ్వకుంటే భూముల లెక్కలు మారిపోతాయి. ఈ చట్టం చూస్తే నాకే భయం వేస్తోంది. పలానా భూమి నాది అని చెప్పుకునే అధికారం లేదు. చేసే తప్పులన్నీ చేసి పారిపోవాలని చూస్తున్నారు. మీ భూమి కూడా మీ చేతుల్లో ఉండని పరిస్థితి రాబోతోంది. ఇక్కడ స్టేడియం కూడా నిర్మిస్తా. గతంలో పనులు చేసిన వారికి బిల్లులు రాకుండా అడ్డుకోవడంతో ఇబ్బంది పడుతున్నారు..బిల్లులు మంజూరు చేస్తాం. అంగన్వాడీలకు అన్ని హామీలు ఇచ్చాడు..నాడు ముద్దులు పెట్టాడు..ఇప్పుడు పిడుగుద్దులు గుద్దుతున్నారు. వారి డిమాండ్లు న్యాయమైనవే..వారికి న్యాయం చేసింది టీడీపీనే. అంగన్వాడీలకు రూ.4 వేలు ఉన్న జీతాన్ని రూ.10,500 చేశాను.
చిరుద్యోగులను వెట్టి చాకిరీ చేయించుకుని, బానిసలుగా చూడటం కాదు..వారి సమస్యలు పరిష్కరించాలి. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు కూడా ఆ పార్టీలో గౌరవం లేదు. వైసీపీకి భవిష్యత్ లేదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మళ్లీ ఇంటికొకరు తయారు కావాలి. భయపడితే భవిష్యత్తు ఉండదు. నేను అంతిచ్చా..ఇంతిచ్చా అంటున్నాడు. స్కాలర్ షిప్ నేను నేరుగా కాలేజీలకు ఇచ్చాను..ఇప్పుడు అకౌంట్లో వేసి ప్రకటనలు ఇచ్చుకుంటున్నాడు. వైసీపీ పోవాలి..రాష్ట్రం బాగుపడాలి’’ అని చంద్రబాబు అన్నారు.