విహారానికి వెళ్ళిన 6గురు యువకుల మృతి కలిచివేసింది

సూర్యలంక బీచ్ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్

బాపట్ల సూర్యలంక బీచ్ లో విహారానికి వెళ్లి విజయవాడ సింగ్ నగర్ కు చెందిన 6గురు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్రంగా కలిచివేసింది. మృతులంతా పేద కుటుంబాలకు చెందిన వారు. చేతికి అందివస్తారనుకున్న పిల్లలను కోల్పోయిన ఆ యువకుల కుటుంబాలకు జరిగిన నష్టం అపారం.

పండుగ వేళ బిడ్డలను కోల్పోయిన ఆ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. పర్యాటక కేంద్రాల వద్ద ప్రభుత్వం తగు రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని కోరుతున్నాను.