సైకిలెక్కిన బాబు

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా హైదరాబాద్ నుంచి తెలంగాణ టీడీపీ యువనేత పొగాకు జయరాం , మరికొందరు తెలుగుయువత నేతలు సైకిల్‌పై అమరావతికి వచ్చారు. సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా వారంతా బాబును కలిసి, జన్మదినశుభాకాంక్షలు చెప్పారు. హైదరాబాద్ నుంచి సైకిళ్లపై తనను అభినందించేందుకు.. మండుటెండలో వచ్చిన తెలుగుయువత నేతల పట్టుదల చూసి, బాబు సంబరపడ్డారు. వారి భుజం తట్టారు. వారి కోరిక మేరకు ఆయన వారొచ్చిన సైకిల్ ఎక్కారు.

Leave a Reply