Suryaa.co.in

Andhra Pradesh

రేపు విశాఖకు చంద్రబాబు

– రెండు రోజులు అనకాపల్లి జిల్లాలో టీడీపీ అధినేత పర్యటన
15న చోడవరంలో మినీమహానాడుకు హాజరు
– 16న అనకాపల్లిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు

గుంటూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తం బుధవారం విశాఖపట్నం వెళుతున్నారు. అదేరోజు సాయంత్రం అనకాపల్లి జిల్లా చోడవరంలో జరగనున్న జిల్లాస్థాయి మినీమహానాడుకు హాజరవుతారు. 16వ తేదీన అనకాపల్లిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహిస్తారు.

టీడీపీ అధినేత రెండు రోజుల జిల్లా పర్యటన షెడ్యూల్‌ : చంద్రబాబునాయుడు బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి 1.45 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రెండు గంటలకు ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.30 గంటలకు చోడవరం వెళతారు. శివాలయం గుడి వద్ద ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనుల కోసం గతంలో సీఎం హోదాలో తాను ఆవిష్కరించిన అనంతరం మినీమహానాడు సభా వేదిక వద్దకుపార్టీ శ్రేణులతో సమీక్షలు నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో బయలుదేరి గాజువాక, ఎన్‌ఏడీ జంక్షన్‌ మీదుగా విజయనగరం వెళతారు.

LEAVE A RESPONSE